సైనికుల చేతిలో లై*గిక బానిసలే!.. యుద్ధం వస్తే మహిళలకు టార్చరే..
Publish Date:Feb 26, 2022
Advertisement
యుద్ధం వస్తే..! ఎవరికీ లాభం జరగదు. అందరికీ నష్టమే. గెలిచిన వారికీ ఎంతోకొంత డ్యామేజీనే. అది.. రష్యా-ఉక్రెయిన్ వార్ అయినా.. అంతకుముందు జరిగిన ప్రపంచ యుద్ధాలైనా. యుద్ధం అంటే.. అదో దారుణం. మిగతా ఆర్థిక, భౌగోళిక నష్టాలు ఎలాఉన్నా.. మహిళలకు వార్ అనేది ఓ టార్చర్. ఇప్పటికే ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యన్ సోల్జర్స్.. అప్పుడే అక్కడి ఆడవారిపై కన్నేశారు. పలు యాప్స్‌తో ఉక్రెయిన్ ఉమెన్‌కు గాలం వేస్తున్నారు. ఇప్పుడైతే కాస్త బెటర్ కానీ.. గతంలో యుద్ధం వస్తే మహిళలపై సైనికుల ఆగడాలు దారుణాతిదారుణంగా ఉండేది. రాజుల కాలంలోనూ అలానే జరిగేవి. శత్రు రాజ్యాల మహిళలను సె-క్స్ బానిసలుగా మార్చేసేవారు. వారిపై క్రూరంగా, ఘోరంగా అఘాయిత్యాలు చేసేవారు. ఆడవారిని ఆటబొమ్మలుగా నలిపేసేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో.. జపాన్-కొరియన్ వార్‌లో జరిగిన సంఘటనలు మహిళల పట్ల సైనికులు ఎంత క్రూరంగా వ్యవహరించేవారో తెలుపుతాయి. 1996లో ఐక్యరాజ్యసమితి నివేదికలో ప్రచురితమైన ఓ బాధితురాలి స్టేట్‌మెంట్.. ఆనాటి ఆకృత్యాలను కళ్లకు కడుతుంది. "నాకు అప్పుడు 13 ఏళ్లు. పొలానికి వెళుతున్న నన్ను జపాన్ సైనికులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించుకున్నారు. తరువాత వారి సాక్సులను నా ముఖంపై విసిరారు. ఆ దుర్వాసనను తట్టుకోలేకపోయాను. అనంతరం వారంతా ఒకరి తర్వాత ఒకరుగా నాపై అత్యాచారం చేశారు. నేను స్పృహతప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చేసరికి జపాన్‌లోని ఏదో ప్రాంతంలో ఉన్నాను. అక్కడున్న ఇరుకైన గదిలో దాదాపు 400 మంది కొరియన్ యువతులు ఉన్నారు. వారంతా మౌనంగా రోదిస్తున్నారు. వారి శరీరాలపై అరకొర దుస్తులు ఉన్నాయి. వారి శరీరాలపై గాయాలు కనిపిస్తున్నాయి. అదే రోజు రాత్రి మేమంతా 5 వేలకుపైగా జపనీస్ సైనికులను సంతోషించవలసి ఉందనే విషయం మాకు తెలిసింది. ఒక కొరియన్ యువతి ప్రతిరోజూ 40 మందికి పైగా పురుషులను సంతోష పెట్టాల్సి వస్తుంది. ఈ కారణంగానే మాకు ‘కంఫర్ట్ ఉమెన్’ అని పేరు వచ్చింది."... ఇది చోంగ్ ఓక్ సన్ అనే బాధితురాలి వేదన. అది రెండవ ప్రపంచ యుద్ధం నాటి సంఘటన. సెకండ్ వరల్డ్ వార్ తొలినాళ్లలో యుద్ధంలో జపాన్ సైన్యం ఆధిపత్యం కొనసాగింది. కొరియన్, చైనీస్, ఫిలిప్పీన్స్ యువతులను బలవంతంగా తీసుకువచ్చి.. కంఫర్ట్ స్టేషన్లలో బంధించేవారు. యువతులను సె-క్స్ బానిసలుగా మార్చే ప్రదేశానికి కంఫర్ట్ స్టేషన్ అనే పేరు పెట్టారు. ఇక్కడుండే ఒక్కో యువతి ప్రతిరోజూ 40 నుండి 50 మంది సైనికుల కోరిక తీర్చాల్సి వచ్చేది. అందుకు సహకరించని వారిపై సామూహిక అత్యా-చారం చేసేవారు.. అంతేగానీ వారిని చంపేవారు కాదు. ఆ యువతులు గర్భం దాల్చకుండా.. వారికి ప్రతి వారం ‘నంబర్ 606’ పేరుతో పిలిచే ఓ ఇంజక్షన్ ఇచ్చేవారు. ఐక్యరాజ్య సమితి నివేదికలో అనేక మంది మహిళా బాధితుల కథనాలు ఉన్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన దారుణ అనుభవం. అంతులేని నరకం. కొరియన్ యువతి 'హ్వాంగ్ సో గన్' స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు. "మొదటి రోజు నాపై అత్యా-చారం చేయడానికి వచ్చిన జపాన్ అధికారి నవ్వుతూ చెప్పాడు.. కుక్కను చంపేటప్పుడు నాకు బాధగా ఉంటుంది.. నీలాంటి యువతులను కొట్టినప్పుడు అలా అనిపించదు.. అంటూ హాయిగా సిగరెట్ తాగి, నా శరీరంపై సిగరెట్ వాతలు పెట్టి, ఆ తర్వాత ప్రశాంతంగా అత్యా-చారం చేశాడు. మొదట్లో హై ర్యాంక్ ఆఫీసర్లు మాపై అత్యా-చారం చేసేవారు. ఆ తర్వాత కింది స్థాయి సైనికులు మాపై అఘాయిత్యం చేసేవారు. ప్రతిరోజూ దాదాపు 50 మంది సైనికుల ఆకలిని తీర్చే యువతికి లైంగిక వ్యాధి వస్తుంది. అప్పుడు ఆమె రాత్రికి రాత్రే అదృశ్యమయ్యేది" అని తెలిపింది. 1932- 1945 మధ్యకాలంలో సుమారు 30 వేల మంది బాలికలను జపనీస్ ఆర్మీ 'కంఫర్ట్ ఉమెన్'గా మార్చారు. ప్రపంచ యుద్ధాలనే కాదు.. ఏ రెండు దేశాల మధ్య నేరుగా యుద్ధం జరిగినా.. మహిళలు బలి కావాల్సిందే.. లై*గిక బానిసలుగా మారాల్సిందే. రాజుల యుద్ధాల కాలం నుంచీ వస్తోంది ఈ దారుణం. ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ వార్‌తో అది ఏ మలుపు తిరుగుతుందో అనే టెన్షన్. ఇప్పటికే మహిళలు, పిల్లలు ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు తరలిపోతున్నారని తెలుస్తోంది. ఈలోపు ఎంతమంది యువతులు.. సైనికుల కామ దాహానికి బలవుతారనే లెక్కలు బయటకు రావు. ఏ యుద్ధమైనా అంతే.
http://www.teluguone.com/news/content/war-effects-on-women-39-132322.html





