వోట్ల బిచ్చగాళ్లు వచ్చేస్తున్నారు

Publish Date:Jun 1, 2023

Advertisement

రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎన్నికల వేళ వరాలు ప్రకటించడం షరా మామూలే. కానీ అవసరం లేకున్న వరాలు ప్రకటించి తీరా అధికారంలో వచ్చాక వాటిని మరుస్తున్న పార్టీ నేతలే ఎక్కువవుతున్నారు.  వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు గెహ్లాట్ . ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వోట్ల కోసం ఉచిత కరెంటు ప్రకటన చేసినట్లు ఆరోపిస్తున్నాయి. 

ఎన్నికలకు ముందు,  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి భారతీయ పౌరుడి బ్యాంక్ ఖాతాకు 15 లక్షల రూపాయలు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.
వాస్తవికత మరోలా  జరిగింది.  రూ.15 లక్షలు ఖాతాలోకి  పడలేదు.
 ప్రజా సంక్షేమం కోసం చేసిన వాగ్దానాల అమలులో చిత్తశుద్ది కనిపించడం లేదు.  చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా జరుగుతోంది. కేవలం ఎన్నికల నేపథ్యంలో చేసిన వాగ్దానాలు చాలా సందర్భాల్లో వైఫల్యం చెందుతున్నాయి. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని కెసీఆర్ వాగ్దానం చేశారు. వాస్తవికతలో అలాంటిది జరగలేదు. 
పంటరుణాలను రూ లక్ష వరకు మాఫీ చేస్తానని కెసీఆర్ మరో వాగ్దానం చేశారు. ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు. 
తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. ఈ వాగ్దానం కూడా అమలు  జరగలేదు. 
కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కీం క్రింద కెజీ నుంచి పీజీ ఉచిత విద్యనందిస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. కానీ ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు. 
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కెసీఆర్  వాగ్దానం చేసి తూట్లు పొడిచారు. 
ఒక్క తెలంగాణ రాష్ట్రంతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసే హామీలు, వాగ్దానాలు అమలు కావడం లేదు. 
వోట్ల కోసం ఆయా పార్టీలు వేసే బిస్కట్స్ అని ప్రజలు గ్రహించాలి. 
 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. శనివారం (జులై 13) శ్రావారిని మొత్తం 75 వేల 916 మంది దర్శించుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఏపీలోని ఒక మహిళా అధికారిపై ఆమె భర్త మదన్‌ మోహన్‌ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని,  భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్‌ ప్లీడర్‌ సుభాష్‌లే కారణమని మదన్‌ మోహన్‌ తన అనుమానాన్ని ఫిర్యాదులో వ్యక్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికలలో గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి రాలేకపోయినా ఇండియా కూటమి గణనీయంగా పుంజుకుంది.
కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి ఉన్న గుర్తింపే వేరు. ఆమె దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ఉంటారనీ, ఆమె మాట తీరు, నిర్ణయాలు తీసుకునే వేగం అన్నీ ఇందిరాగాంధీని స్ఫురణకు తీసుకువస్తాయన్నది మెజారిటీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల భావన.
అనంత్, రాధికల జంట నిజంగానే చూడముచ్చటైన జంట. ఈ జంటకి తెలుగువన్ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తోంది. అదే.. #aaram.
 పూరి జగన్నాథ రథ యాత్రకు వెళ్లి తిరిగొస్తున్న తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఒడిశాకు యాత్రికులతో బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు  తిరిగి వస్తుండగా ఒడిశాలో ప్రమాదానికి గురైంది.
కాళ్ళకు నమస్కారాలు పెట్టే సంస్కృతిని మానాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
త ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఆ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిల బడింది.
ఎపిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్‌ మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముకేశ్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆ స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు. 
యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు ఇస్కాన్‌కి కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. అలాగే అన్న క్యాంటిన్ల నిర్వహణ కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి పూజలు చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన, అవమానకరమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఐదేళ్ల పాలనా వైభోగాన్ని చూసి ఇక దయచేయండి అని మర్యాద కూడా లేకుండా చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.