అవినాష్ రెడ్డి కొంప ముంచిన పెదనాన్న ప్రతాప్ రెడ్డి

Publish Date:Jun 1, 2023

Advertisement

రోజుకో మలుపు తిరుగుతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా అజ్ణాత సాక్ష్యులు కీలక సమాచారాన్ని అందిస్తున్నారు. అజ్ణాత సాక్షుల సమాచారంతో సీబీఐ ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని జోడించి నివేదికలు తయారు చేస్తోంది. 2019 మార్చి 15వ తేదీన జరిగిన వివేకా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీబీఐని తప్పించుకు తిరుగుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు నుండి ఉ;శమనం పొందుతున్నారు.

పులివెందులలో  పార్టీ కార్యక్రమాలున్నాయంటూ ఒక సారి, తల్లిగారికి ఆరోగ్యం బాలేదంటూ మరోసారి, తన తల్లికి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానంటూ ఇంకో సారి, హైదరాబాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోందని మరోసారని సీబీఐకు అవినాష్ ముఖం చాటేస్తూ వస్తున్నారు. అసలు అవినాష్ తల్లిగారి ఆరోగ్యం విషయంలో అవినాష్ వర్గం అసత్యాలు చెబుతోందని కూడా సీబీఐ అభిప్రాయపడిందని వార్తలు వెలువడ్డాయి. వృత్తిరిత్యా వైద్యురాలైన వివేకా కుమార్తె సునీత కూడా అవినాష్ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడం గమనార్హం. ఆ విషయం పక్కన పెడితే అవినాష్ వాయిదాలు వేసిన సమయాన్ని సీబీఐ చక్కగా వినియోగించుకుంది.

 కొంత మంది అజ్ణాత వ్యక్తులను, అంటే కేసుతో సంబంధం లేదని అందరూ అనుకుంటున్న వ్యక్తులను సీబీఐ ప్రశ్నించి కీలక వివరాలు సేకరించింది. వీరిలో మొదటి వ్యక్తి ఐఏఎస్ అధికారి కల్లం అజయ్ రెడ్డి. జగన్ కుటుంబానికి దగ్గరగా మసలే అజయ్ కల్లంను సీబీఐ ప్రశ్నించింది.  2019 మార్చి 15ం తేదీ లెల్లవారు జామున సుమారు 4.15 గంటలకు వివేకా చనిపోయారన్న విషయం తనతో జగన్ చెప్పారని అజయ్ కల్లం వెల్లడించారు.  2019 ఎన్నికల మేనిఫెస్టో తయారీ పనుల్లో ఉన్న తనతో జగన్ ఈ విషయాన్ని పంచుకున్నారని, చిన్నాన్న నో మోర్ అనే క్లుప్త సమాచారాన్ని తనకు అందించారని కల్లాం చెప్పుకొచ్చారు.  వివేకా హత్య కేసు డైరీలో ఆయన హత్యకు సంబంధించిన మొదటి సమాచారం 6.30గంటలకు పీఏ కృష్ణారెడ్డి ద్వారా సీఐ శంకరయ్యకు తెలిసింది.  తరువాతే ప్రపంచానికి తెలుసు అనేది ఎఫ్ఐఆర్ వివరణ. కానీ అంతకు ముందే లోటస్ పాండ్ కు ఎలా సమాచారం అందింది అనేది సీబీఐ ప్రశ్న. దీనికి సంబంధించి లోటస్ పాండ్ లో ఉన్న వారిని విచారించాలన్నది సీబీఐ వాదన.

ఇది మొదటి అజ్ణాత సాక్షి కథ. ఇక తాజా అజ్ణాత సాక్షి వివరణ ఇలా ఉంది. నేను వివేకా ఇంటికి వెళ్లినప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి అక్కడే ఉన్నారు. వివేకా శవం రక్తపుమడుగులో పడి ఉంది.  తండ్రీ కొడుకులు ఇద్దరూ రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నారు. తరువాత వివేకా మృతదేహాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి, కట్లు కట్టి పడుకోబెట్టారు. ఇది మరో అజ్ణాత సాక్షి వైఎస్ ప్రతాపరెడ్డి సాక్ష్యం. వైఎస్ ప్రతాపరెడ్డి స్వయానా అవినాష్ రెడ్డికి పెదనాన్న, భాస్కరరెడ్డికి సొంత అన్న. ఈ కేసులో ఇంకా ఎంత మంది సాక్షులు బయటకు వస్తారో తెలీదు. కానీ వివేకా కేసు ఒక కేస్ స్టడీ. అతీంద్రియ వ్యక్తులు, అదృశ్య శక్తులు, అజ్ణాత సాక్షులు ఈ కేసును ఇంకా ఎన్నిమలుపులు తిప్పుతారో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది.
బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.