ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ఇక ముగిసిన అధ్యాయమే.. కారణం జగన్ నిర్వాకమే!

Publish Date:Nov 20, 2024

Advertisement

కత్తి వాడటం మొదలు పెడితే, నా కన్నా బాగా ఎవడూ వాడలేడు అంటూ మిర్చి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. దానికి కొంచం మార్చి మనుషులను వ్యవస్థలను వాడుకోవడంలో తనను మించిన వాడు ఎవడూ ఉండడు అన్నట్లుగా  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా ఇష్టారీతిగా వాడేసుకున్నారు. ఆ వాడకంలో ఆయన తన కోసం తన చేత తానే సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. వాడకం పూర్తయిన తరువాత జగన్ అంత కాలం తన కోసమే పని చేసిన మనుషులను, వ్యవస్థలను కూడా కూరలో కరివేపాకులా విసిరి అవతల పారేశారు. అలా పారేశిన వాటిలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది.

అందుకే ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి కూడా లేకుండా పోయింది. ఆయన కోసం అన్నీ వదులుకుని నామమాత్రపు వేతనాల కోసం వాలంటీర్లుగా చేరిన లక్షలాది మంది యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఔను ఇదే విషయాన్ని శాసనమండలి వేదికగా  మంత్రి డోలా బాలవీరాంజనేయులు చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అన్నదే లేకుండా పోయిందని ఆయన కుండబద్దలు కొట్టేశారు.  గత ఏడాది ఆగస్టు నుంచే రాష్ట్రంలో  వాలంటీర్ వ్యవస్థ ఉనికి మాయమైపోయిందని శాసన మండలి జీరో అవర్ లో మంత్రి డోలా బాల వీరాంజనేయ శర్మ చెప్పారు. జగన్ గత ఏడాది ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందనీ, కానీ ఆయనా పని చేయకపోవడంతో ఆ నాటి నుంచి  ఆ వ్యవస్థ రాష్ట్రంలో లేకుండా పోయిందనీ అన్నారు. జగన్ నిర్వాకం వల్ల గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థకు కాలం చెల్లిందని వివరించారు.

వాలంటీర్లను కొనసాగిస్తామంటూ తాము ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వాలంటీర్లను కొనసాగించి వారికి వేతనాలు ఇద్దామని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని చెప్పిన మంత్రి డోలా  కొలువులో లేని ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వేతనం ఇవ్వడానికి ఎలా సాధ్యమౌతుందని సభా ముఖంగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లనే   వాలంటీర్లను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయిం దని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ సర్కార్ పునరుద్ధరించి ఉన్నట్లైతే తమ సర్కార్ ఇప్పుడు దానిని తప్పని సరిగా కొనసాగించేదని డోలా బాల వీరాంజనేయులు సభా ముఖంగా చెప్పారు.  

జగన్ హయాంలో  రాష్ట్రంలో  2,63,000 మంది వాలంటీర్లు ఉండేవారనీ, వారిలో లక్షా ఏడు వేల మంది సరిగ్గా ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపిన మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా పది వేల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని వివరించారు.   రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే తాము అప్పట్లో రాజీనామాలు చేశామని చెబుతున్నారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లుగా భావించి తిరిగి కొలువులోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే వాలంటీర్ల పట్ల ప్రజలలో ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదు. వారు వైసీపీ ఏజెంట్లని ప్రజలందరికీ తెలుసు. అందుకే వారిని కొనసాగించాలన్న వాదనలో ఇసుమంతైనా పస లేదు. అయినా వాలంటీర్ల ప్రాథమిక బాధ్యత సామాజిక పింఛన్ల పంపిణీ, అది ఈ ఐదు నెలలుగా వారు లేకుండా కూడా సజావుగా సాగుతోంది. అటువంటప్పుడు  ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా వాలంటీర్లను కొనసాగించడంలో అర్ధం ఉండదని డోలా బాల వీరాంజనేయులు శాసనమండలి జీరో  అవర్ లో స్పష్టంగా చెప్పారు. 

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.