కాక్రోచ్ ఉద్యమం.. నిరాయుధం.. ప్రమాదకరం.!
Publish Date:Jul 24, 2026
Advertisement
ఒక దేశంలోని 150 కోట్ల మంది ప్రజలను ఎల్లకాలం మోసం చేయడం సాధ్యమేనా? ఒక మహా సామ్రాజ్యాన్ని నిరంతరం ఏలగలరా? అంటే అది అసాద్యం అన్న సమాధానమే వస్తుంది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కాక్రోచ్ లు వీధుల్లోకి వచ్చాయి! ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు. సరిహద్దు గోడలు, ముళ్ల కంచెలు, పోలీసు లారీలు, వాటర్ క్యానన్లు, లాఠీచార్జీలు... వీటివేవీ యువత ఆక్రోశాన్ని, ఆగ్రహాన్నీ ఆపలేకపోతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాగత అవినీతి, ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం కేవలం ఒక మంత్రి రాజీనామాకో, పరీక్షల రద్దుకో పరిమితం కాదని, ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ఉద్యమకారులు చెబుతున్నారు. మతం, కులం, వర్గం ఆధారంగా పౌరుల మధ్య వ్యత్యాసం చూపే విభజన రాజకీయాలను ఎండగడుతూ, ఎలాంటి ఆయుధాలు లేకుండానే శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమం ప్రస్తుత పాలక వ్యవస్థ పునాదులను కదిలించివేస్తున్నది. Delhi students protest, Cockroach Janata Party, Competitive exam paper leak, Demand for Education Ministers resignation
http://www.teluguone.com/news/content/cockroach-movement--unarmed-39-226961.html





