విశాఖ రింగు వలల వివాదం ఏంటీ? మత్స్యకారుల అలజడి ఎందుకు? 

Publish Date:Jan 5, 2022

Advertisement

విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో తీవ్ర అలజడి నెలకొంది. రింగు వ‌ల వివాదంతో పరిస్థితి నివురు గప్పినా నిప్పులా ఉంది. మత్స్యకార గ్రామాల్లో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేసి, 144 సెక్షన్‌ విధించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, డీసీపీ గౌతమి శాలి, ఏడీసీపీలు శ్రావణ్‌కుమార్‌, ఆనందరెడ్డి, పలువురు ఏసీపీలు తీరంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. మత్స్యకారుల మధ్య ఘర్షణ తలెత్తటంతో నౌకాదళం, కోస్టుగార్డు, మెరైన్‌ విభాగ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నౌకాదళ సిబ్బంది హెలికాప్టర్‌తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  

కొందరు మత్స్యకారులు రింగ్‌ వలలతో వేట సాగిస్తుండగా... మరికొందరు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది. కొందరికి గాయాలు కాగా ఆరు పడవలు దహనమయ్యాయి. ఫలితంగా విశాఖ సాగరతీరంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీరానికి సమీపంలో ‘రింగ్‌ వలలు’ వినియోగిస్తే సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందనే అంశంపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మత్స్యకారులు పడవలపై రింగ్‌ వలలతో వేటకు వెళ్లారు. పెదజాలరిపేటకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు వారి వేటను అడ్డుకునేందుకు పెద్దసంఖ్యలో పడవలపై బయలుదేరారు. మంగమారిపేట తీరంలో సముద్రంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు, రింగ్‌ వలలతో వేట సాగిస్తున్న వారు కొందరు గాయపడ్డారు. 

గాయపడిన మత్స్యకారులు పెదజాలరిపేటకు వచ్చి తమ ప్రాంతంలోని వారికి సమాచారం అందించారు. ప్రతిదాడి చేయడానికి పెదజాలరిపేట వాసులు భారీసంఖ్యలో సమీపంలోని వాసవానిపాలెం, జాలరిఎండాడలకు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. మత్స్యకారులను నిలువరించేందుకు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. చివరికి వారిని వెనక్కి పంపేయడంతో వివాదం కొంత సద్దుమణిగింది.   

ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు సాగుతున్న సమయంలో మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడకు చెందిన వారి పడవలను కొందరు తమతో పాటు తీసుకువెళ్లి జాలరిపేట తీరంలో దహనం చేశారు. నాలుగు పడవలు పూర్తిగా, రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామాల వాసులు సాగరం ఒడ్డున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకుని శాంతింపచేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను మరో గ్రామానికి చెందిన వారు బంధించడం కలకలం రేపింది. పోలీసులు ఆ ఇద్దరినీ విడిపించారు. 

రింగు వల అంటే ఏమిటి? వివాదం ఎందుకు?

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సాధారణంగా గిల్‌, రింగు వలల్ని ఉపయోగిస్తారు. రింగు వల కన్ను వృత్తాకారంలో ఉంటుంది. దీని ఖరీదు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు. ఈ వలలో చిన్నచిన్న చేపలూ చిక్కుతాయి. కాబట్టి పెద్దమొత్తంలో పట్టుకునే అవకాశం ఉంది. తీరం నుంచి 8 కిలోమీటర్లలోపు దీన్ని ఉపయోగిస్తుండటంతో గిల్‌ వలలతో వేటను సాగించే సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరక్క నష్టం కలుగుతోంది. ఈ కారణంగా 8 కి.మీ.లోపు రింగు వలల వినియోగాన్ని నిషేధించారు.   

గిల్‌ వల:  ఈ వలకు చతురస్రాకారంలో కన్ను ఉంటుంది. దీని ఖరీదు రూ.20 వేల నుంచి రూ.50 వేలు. ఈ వలల్ని వాడే మత్స్యకారుల సంఖ్య ఎక్కువ. ఈ వలకు పెద్ద చేపలు చిక్కి, చిన్న చేపలు జారి పోతాయి. రింగు వలతో పోలిస్తే దీనిలో తక్కువ చేపలు పడతాయి. అందుకే  రింగు వలతో తమకు నష్టం జరుగుతుందంటూ గిల్ వల  మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. 

By
en-us Political News

  
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.