సదస్సు వల్ల తెలంగాణాకు ఎలాంటి ప్రయోజనంలేదు:ఎంపి వివేక్
Publish Date:Jan 15, 2012
Advertisement
హైదరాబాద్:పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సు వల్ల తెలంగాణా ప్రాంతానికి ఎలాంటి ఉపయోగమూ లేదని పెద్దపల్లి ఎంపి,కాంగ్రెస్ నేత వివేక్ అభిప్రాయపడ్డారు.సీమాంధ్రుల సదస్సుగానే భాగస్వామ్య సదస్సు ముగిసిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రులనే ప్రమోట్ చేశారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికే ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజీవ్ యువకిరణాలు, కిలో రూపాయి బియ్యం పథకాలకు ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదని తెలిపారు.తెలంగాణా కావాలా,వద్దా అనే విషయాన్ని ప్రజలు ఉపఎన్నికల ద్వారా తెలియజేయజేస్తారని పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకూడదన్నారు. తెలంగాణా ఏర్పాటును సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని, అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఉపఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పినా, తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చెప్పినా జగన్ ముమ్మాటికీ సమైక్యవాదేనన్నారు.
http://www.teluguone.com/news/content/vivekanandha-24-10946.html





