వివేకా హత్యకు జగన్‌ ప్లాన్‌?

Publish Date:Mar 2, 2022

Advertisement

కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డే పథక రచన చేసి ఉండొచ్చని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకే జగన్‌ తన మామను కుట్రపూరితంగా హతమార్పించి ఉంటారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. కోడికత్తి కేసు మాదిరిగానే రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వివేకానందరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు తనకు అనిపిస్తోందనే డౌట్‌ ను రాజశేఖర్‌ రెడ్డి వెలిబుచ్చారు. సీబీఐ ముందు రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన ఈ విషయం చెప్పారు. కోడికత్తి కేసులో తనకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ కీలక పదవులు కట్టబెట్టిన వైనాన్ని నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రస్తావించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానం వచ్చి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్‌, అవినాష్‌ రెడ్డి ఓడిపోయి ఉండేవారన్నారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయాలతో లింక్‌ పెట్టి జగన్ మాట్లాడడం తనకు నచ్చలేదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన మామ చేసిన అప్పులు తీర్చేందుకు హైదరాబాద్‌ లో రెండు ఇళ్లు, ఒక ఫ్లాట్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లో జల విద్యుత్‌ కేంద్రంలోని 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చిందని నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. రాజకీయాలు వదిలేయాలని వివేకా నిర్ణయించుకున్నారని, అయితే.. జగన్‌ ఒత్తిడి కారణంగానే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేశారని రాజశేఖర్‌ రెడ్డి గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో తన కన్నా బలహీనుడైన బీటెక్‌ రవి చేతిలో 30 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారన్నారు. అలా ఎందుకు ఓటమి ఎదురైందని గంగిరెడ్డిని ప్రశ్నిస్తే వెన్నుపోటే కారణమని చెప్పినట్లు ఆయన తెలిపారు. వివేకా కోసం కాకుండా తన కోసం పనిచేయాలని శివశంకర్‌ రెడ్డికి 70 లక్షల రూపాయలు ఇచ్చినట్లు కాలేజీలోతన జూనియర్‌ అయిన బీటెక్‌ రవి తనతో చెప్పారన్నారు. ఆ ఎన్నికల్లో మా బంధువులు భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని ఓట్లు వివేకానందరెడ్డికి పడకుండా చేయడం వల్లే ఆయన ఓడిపోయారని అన్నారు. అప్పటికే అవినాష్‌ రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గరయ్యాడని తెలిసిందని రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల తర్వాత ఎర్ర గంగిరెడ్డి తన సోదరుడి పేరు మీద ప్రొద్దుటూరులో కోటి రూపాయల విలువైన వ్యవసాయ భూములు కొన్నాడని చెప్పారు.

వివేకా హత్య అనంతరం ఆయన వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసేందుకు 2019 మార్చి 23న తాను, తన భార్య సునీత సైబరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ కు బయల్దేరామని, అంతలో వైఎస్‌ భారతి, విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తమ ఇంటికి వచ్చారని వివేకా అల్లుడు సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. ‘వివేకా హత్యకు సంబంధించి మేం ఏం చేసినా సజ్జలకు చెప్పాలని భారతి సూచించారు. అప్పటికి మా కుటుంబ సభ్యులెవరిపైనా సందేహాలు లేవు. అప్పట్లోనే సందేహం వస్తే జగన్‌, అవినాష్‌ రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బంది పడేవారు‘ అని రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ‘వివేకా హత్య జరిగిన రోజు సాయంత్రానికి జగన్‌ హైదరాబాద్‌ నుంచి పులివెందుల చేరుకున్నారు. విలేకరుల సమావేవంలో ఏం మాట్లాడాలో అప్పటికా సజ్జలతో జగన్ చర్చించారు. అప్పటికి వివేకా ఇంటిలో లేఖ దొరికిన విషయం, ఆ లేఖలో డ్రైవర్ ప్రసాద్‌ పేరు ఉన్నట్లు గానీ నాకు, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే.. జగన్‌ విలేకరుల సమావేవంలో ఆ లేఖ గురించి ప్రస్తావించారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడడం తనకు నచ్చలేద’ని రాజశేఖర్‌ రెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారు. ఇదే విషయం జగన్‌ కు తాను ఆ తర్వాత చెప్పానని రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.

‘సీఐ శంకరయ్యకు 2019 మార్చి 15న నేను తెలుగులో రాసి ఇచ్చినట్లు ఒక స్టేట్‌ మెంట్‌ కాగితం నాకు సీబీఐ అధికారులు చూపించారు. ఆ రోజు నేను ఎలాంటి స్టేట్‌ మెంటూ ఇవ్వలేదు. ఆ రోజు హైదరాబాద్‌ నుంచి మేం వేకువజామునే బయల్దేరామని, వివేకా హత్య గురించి కృష్ణారెడ్డి ఫోన్ చేసే సమయానికి మేం కర్నూలు చేరుకున్నామని అందులో రాసి ఉంది. ఆ రోజు ఉదయం 6.15కు కృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి హైదరాబాద్‌ లోనే ఉన్నాం. 7.30కి హైదరాబాద్‌ నుంచి బయల్దేరాం. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీద నుంచి కింద పడటం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని నేను అన్నట్లు రాశారు. అది నిజం కాదు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్‌ డీపీఓ నాగరాజుకి నేను మరో స్టేట్ మెంట్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అదీ నిజం కాదు. దాన్నీ సృష్టించారు. 2019 మార్చ 15న సీఐ శంకరయ్య నాకు నోటీసు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. నాక పోలీసులు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. కేసును తప్పుదారి పట్టించేందుకు పోలీసులే ఆ తప్పుడు స్టేట్‌ మెంట్‌ లన్నీ సృష్టించారు’ అని సీబీఐ ముందు రాజశేఖర్‌ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.

‘వివేకానందరెడ్డికి భాస్కర్‌ రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. 2017లో ప్రభుత్వ భూమిన స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీకి కేటాయించేందుకు వివేకా ప్రయత్నించారు. అది అవినాష్‌ రెడ్డికి నచ్చలేదు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. వివేకా రాజకీయ పరపతి ముందు భాస్కర్‌ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మరుగుజ్జులు. ఆయన ముందు నిలబడేందుకే జంకేవారు. కుటుంబం కోసం తాను ఎన్ని త్యాగాలు చేసినా వారు తాను అంటే అసూయతోనే ఉంటున్నారని మరణించడానికి రెండు మూడు నెలల ముందు మా మామయ్య నాతో చెప్పి బాధపడ్డారు’ అని రాజశేఖర్‌ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన తర్వాత ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్‌ రెడ్డి పేరును జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపాదించారు. అది వివేకాకు ఇష్టం లేదు. విజయమ్మ గానీ, జగన్‌ గానీ పోటీ చేయాలని వివేకా సూచించారు. దాంతో వారి మధ్య సంబంధాలు ఇంకా దిగజారిపోయాయి. భాస్కర్‌ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇష్టానికి వ్యతిరేకంగా వివేకా ఓ భూవివాదం సెటిల్మెంట్‌ లో పాల్గొన్నారు. అప్పటి నుంచీ వారు వివేకాపై మరింత కక్ష పెంచుకున్నారు’ అని రాజశేఖర్‌ రెడ్డి వెల్లడించారు.

‘వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్‌ సురేష్‌, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి కంప్లైంట్ రాసుకొచ్చి, నా భార్య సునీతను సంతకం పెట్టాలన్నారు. అందులో టీడీపీ నేతలు సతీష్‌ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పెట్టారు. అది సరైన విధంగా లేదని, దానిపై సంతకం చేయడానికి సునీత నిరాకరించారు. కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పుతున్నారని గుర్తించడం వల్లే ఆమె సంతకం చేయలేదు. తండ్రిని కోల్పోయిన సునీతకు ఆ టైమ్‌ లో రాజకీయాలు ముఖ్యం కాదు’ అని వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.