విజయసాయికి జగన్ చెక్.. రాజ్యసభ డౌట్.. ఇక పార్టీకే పరిమితం!
Publish Date:Mar 2, 2022
Advertisement
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, మొదటి నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకుని ఉన్న ముఖ్య నాయకుల్లో, విజయసాయిరెడ్డి ముందువరసలో ఉంటారు. రాజకీయ వ్యాపారోల్లోనే కాదు ఇతరత్రా వ్యవహారల్లోనూ విజయ సాయి రెడ్డి నెంబర్ 2 గానే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ రెడ్డి ఆయనకు అదే ‘స్థానం’ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే,ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ఆ స్థానంలోకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చారు. విజయ సాయి, ఢిల్లీకి, విశాఖ ల్యాండ్ డీల్స్’కు పరిమితం అయ్యారు. అదలా ఉంటే, జూన్, జూలై మాసాల్లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్య సభ స్థానాలకు జూన్ (2022) లో ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఈ నాలుగు స్థానల్లోనూ వైసీపీ అభ్యర్ధులే గెలుస్తారు. పదవి కాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.అలాగే, ఆయనను మళ్ళీ నామినేట్ చేయడం ఖాయం అనే ప్రచారం కుడా జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, విజయ సాయికి ఛాన్స్ లేదని జగన్ రెడ్డి స్పష్టం చేశారని, అయన ‘సేవల’ను పార్టీకి ఉపయోగించుకోవాలని జగన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
అదలా ఉంటే, విజయసాయి రెడ్డి’ కి మరోసారి రాజ్య సభ టికెట్ రాకపోవచ్చని, వైకాపా వర్గాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా, సభలో పార్టీ నేతగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఈసారి రాజ్యసభ పంపరాదని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ఆయనకు, వైసీపీ అనుబంధ విభాగాల బాధ్యతలు అప్పగించారని, అంటున్నారు. ఇదొక విధంగా, విజయ సాయి రెడ్డిని క్రియాశీల పాత్ర నుంచి తప్పించడమే అని, ఇందుకు ప్రధానంగా కొన్ని కీలక విషయాల్లో ఢిల్లీలో చక్రం తిప్పడంలో విజయ సాయి విఫలం కావడమే కారణమని అంటున్నారు.
అయితే, ఇది ఇప్పటికిప్పుడు తీసుకున నిర్ణయం కాదని, వన్, టూల మధ్య చాలా కాలంగా దూరం పెరిగిందని ప్రతి వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఎలివేషన్’కు సమాంతరంగా విజయ సాయి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అందుకే ఉద్యోగుల సమ్మె విషయంలో సజ్జలకు చిక్కులు సృష్టించే విధంగా విజయసాయి ప్రయత్నించారని,ఆ ప్రయత్నాల పర్యవసానంగానే, తాజా పరిణామాలు చితు చేసుకుంటున్నాయని అంటున్నారు. అయితే, జగన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, విజయ సాయి, ప్రస్తుతానికి సైలెంట్’గానే ఉంటారని, అవకాసం చిక్కితే మాత్రం, సజ్జలకు చుక్కలు చూపించదం ఖాయమని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-in-trouble-39-132434.html





