వివేకా హత్యకు ముందే వైఎస్ కుటుంబంలో కోల్డ్ వార్?!

Publish Date:Jul 22, 2023

Advertisement

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి  స్వయానా సోదరుడు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తిరగాలో అన్నీ తిరుగుతున్నది. ఈ హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్నా.. ఇదిగో వీళ్ళు ఈ హత్య చేసింది అని తేలలేదు. అయితే, విచారణ జరిగిన తీరు, సీబీఐ ఇచ్చిన వాంగ్మూలాలు, సొంత కుటుంబ సభ్యులే ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో నేరస్తులు ఎవరో బాహ్య ప్రపంచానికి ఎప్పుడో చెప్పేశాయి. ఇక మిగిలింది ఈ కిరాతకమైన హత్య కేసులో చట్టప్రకారం న్యాయస్థానాలే దోషులను శిక్షించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడో ఇదిగో అదిగో అని వాయిదా పడుతూ వస్తుంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. సీబీఐ ఈ కేసు విచారణను ఎప్పుడో ముగించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఇంకా తేల్చడం లేదు. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తాను నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30వ తేదీన కోర్టుకు సమర్పించింది. దాదాపు 145 పేజీల చార్జి షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల, ఆయన ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, వైసీపీ కీలక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ కూడా ఈ సాక్షుల జాబితాలో ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే, ఈ కేసులో సాక్షిగా గత ఏడాది అక్టోబర్ 7న వైఎస్ షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో 259వ సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. వాంగ్మూలంలో షర్మిల నా వద్ద ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని.. ఈ హత్యకు కుటుంబ ఆర్ధిక అంశాలు కారణం కాదని.. ఆవినాష్ కుటుంబానికి.. వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకి కారణం కావచ్చని.. వారి దారికి వివేకా అడ్డువస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చని షర్మిల పేర్కొన్నారు. 

అంతే కాదు, కుటుంబంలో అందరం బాగున్నట్లు బయటకి కనిపించినా లోపల కోల్డ్ వార్ నడిచేదని షర్మిల సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం కూడా షర్మిల సీబీఐకి వివరించారని అంటున్నారు. హత్యకు కొన్ని నెలల ముందే వివేకా బెంగుళూరులో షర్మిల నివాసానికి వెళ్లగా.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టారని.. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయకూడదని వివేకా గట్టిగా కోరుకున్నారని.. అవినాష్ కు ఎంపీ టికెట్ రాకుండా జగన్మోహనరెడ్డిని ఒప్పిద్దామని బాబాయ్ తనతో చెప్పారని.. అలాగే జగన్ కు వ్యతిరేకంగా కూడా వెళ్లే ఉద్దేశం తనకు లేదని.. ఈ విషయంలో మీరు కూడా జగన్ కు చెప్పాలని తన చిన్నాన్న తనను కోరినట్లు షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నారు. 

అయితే, ఆ తర్వాత కడప ఎంపీ టికెట్ విషయంపై చిన్నాన్న తమపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారని.. కానీ ఆ సమయంలో తామేమీ చెప్పలేకపోయామని.. అప్పటికి ఇంకా టికెట్ల ఖరారు కూడా కాలేదని.. తీరా ఆ సమయానికి ఆయన్ను లేకుండా చేశారని షర్మిల పేర్కొన్నట్లు తెలుస్తున్నది. షర్మిల చెప్పిన దాని ప్రకారం చూస్తే వివేకా హత్యకేసులో వైసీపీ నేతలు చెప్పినట్లు ఆర్ధిక కారణాలు, ఆయన రెండో వివాహం, ఫ్యాక్షన్ పగలు లేనే లేవని స్ఫష్టమవుతుంది. ఒక్క కడప ఎంపీ టికెట్ చుట్టూనే ఈ హత్యకేసు తిరుగుతున్నది. 

దీంతో పాటు హత్య జరిగిన సమయంలో జగన్  హైదరాబాద్ లోటస్ పాండ్ లో మ్యానిఫెస్టోపై చర్చిస్తుండగా  అవినాష్ రెడ్డే ఈ విషయాన్ని వాళ్లకు చేరవేశారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్‌లు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అవినాష్ చిన్నాన్న ఇక లేరనే విషయాన్ని మాత్రమే జగన్ కు చెప్పారని, బాత్ రూమ్, బెడ్ రూమ్ లో రక్తం ఉందనే విషయాన్ని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. హత్య జరిగిందని కానీ.. ఎవరో చేశారని కానీ అవినాష్ జగన్ తో చెప్పినట్లు ఎవరూ వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీని ప్రకారం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే విషయం స్పష్టమవుతుంది.

By
en-us Political News

  
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.