దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక హై ప్రొఫైల్ కేసులోనే సాక్షి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఏమిటి? అసలేం జరుగుతోంది ఏపీలో. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయాన చిన్నాన్న వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగు చూస్తున్న తరుణంలో ఈ కేసులో సాక్షిగా వున్న వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది.
చిత్రమే మంటే సినిమాటిక్‌గా ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం. గతంలో పరిటాల రవి కేసులో సాక్షులు వరుసగా ఇలానే మృతి చెందడాన్ని గుర్తు చేస్తూపలువురుకేసు ఎలా సాగుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నసీబీఐ అధికారులకే బెదరింపులు రావడం తెలిసిందే. అసలు రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లోనే ఇటువంటి పరిస్థితి గురించి వినడం, చూడటం పోలీసువర్గాల మీద నమ్మకం తగ్గిస్తుంది. మంత్రి వై.ఎస్.వివేకా నంద రెడ్డి హత్యకేసు ఇప్పటికే మలుపులు తిరి గింది. ఇపుడు ఆ కేసుకు సంబంధించిన సాక్షి గంగా ధర్ రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందడంతో కేసు మరో కీలక మలుపు తిరిగిందనే అనాలి.
అంతపురం జిల్లా యాడికి కి చెందిన గంగాధర్ తన నివాసంలో మరణించేడు. గురువారం ఉదయం లేవ లేదు. కుటుంబసభ్యులు వైద్యుల్ని సంప్రదించగా అతను పల్స్‌రేట్ పడిపోవడం వల్లనే మరణించినట్లు ప్రకటించేరు. పోలీసులు ఈ మరణం సహజ మరణం కాదని తేల్చేరు. కేసు విషయానికి వస్తే, వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లయింది. కానీ అసలు సూత్రధారలు ఎవరన్న ది సిబిఐ ఇప్పటి వరకూ తేల్చలేకపోయింది. ఈ కేసులో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. అప్పటి నుంచి తన ప్రాణాలను కాపాడాలని పోలీసులకు మొరపెట్టుకుంటూనే వున్నాడు. ఏ క్షణాన తనకు ఏమవుతుందోనన్న భీతిలోనే బతుకుతున్నాడు. పోతే, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారు లపై ఉల్టా కేసు పెట్టడమేకాకుండా, వారి డ్రైవర్‌నీ బెదిరించడం మరీ చిత్రం.
సీబీఐ వారు దేన్ని అనుమానించక వదలరు. రెండు రోజుల క్రితమే పులివెందులలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి దగ్గరలోనే వున్న ఎం.పీ అవినాష్ రెడ్డి, వివేకా నివాసంలో, పరిసరాల్లో మళ్లీ తని ఖీలు చేపట్టడమేకాకుండా ప్రభుత్వ సర్వేయర్‌తో నివాసాల కొలతలను తీయించేరు. సీబీఐ దర్యాప్తు కాస్తంత వేగిరంగా కానిస్తోంది అనుకున్నారు. ఇంతలో గంగాధర్ రెడ్డి అసహజ మరణం ప్రాధాన్యత సంతరించుకుంది.
గంగాధర్ అనుమానాస్పద మృతి గురించి వింటూంటే గతంలో టీడీపీ నేత మాజీమంత్రి పరిటాల రవి
హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మొద్దు శీనుకు, శీనును హత్య చేసిన ఓంప్రకాశ్ లకు జరిగినట్లే వివేకా హత్య కేసులో కూడా సీన్ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/viveka-murder-case-vitness-suspicious-death--25-137353.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.