విశాఖ ఉక్కుకు ముడి ఇనుము కొరత
Publish Date:Mar 14, 2012
Advertisement
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు జరిపి ప్రాణాలు ఫణంగా పెట్టి ఉక్కు కర్మాగారాన్ని సాధించారు. మొదట్లో కొంతకాలం నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ కర్మాగారం ఇప్పుడు లాభాల్లో పయనిస్తోంది. వేలాదిమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కర్మాగారానికి ముడి ఖనిజం కొరత రూపంలో ముప్పు ఎదురుకాబోతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రస్తుతం నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముడి ఖనిజాన్ని సరఫరా చేస్తోంది. ఈ సరఫరా ఉక్కు అవసరాలకు తగినంతగా లేకపోవడం, ఖనిజం ధర పెరగడంతో విశాఖ ఉక్కు మళ్ళీ నష్టాల మార్గంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని విస్తరించాలన్న యాజమాన్యం నిర్ణయం కూడా ముడి ఖనిజం కొరత కారణంగా వాయిదాపడే ప్రమాదం ఉంది. అసలు ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో గనులను ధారాదత్తం చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి కూడా కడపలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతానంటూ అనంతపురంలో గనులను లీజుకు తీసుకున్నాడు. కర్మాగారాన్ని నెలకొల్పకుండానే గనుకను లూటీ చేశాడు. చివరకు జైలు పాలయ్యారు. అటువంటి వ్యక్తులను నమ్ముతున్న ప్రభుత్వాలు వేలాదిమందికి ఉపాధినిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ గనులను కేటాయించడపోవడం శోచనీయం. ఈ కర్మాగారానికి గనులు కేటాయించాలని ఉక్కు కర్మాగార యాజమాన్యం ఎప్పటినుంచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. కానీ ఏ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. ఒడిశా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గనులకోసం విశాఖ ఉక్కు యాజమాన్యం దరఖాస్తులు చేస్తుంది. అయితే తమ రాష్ట్రాల్లో విశాఖ ఉక్కుకు అనుబంధంగా యూనిట్లు ఏర్పాటుచేస్తే కనులు లీజుకు ఇస్తామని ఆ ప్రభుత్వాలు షరతు పెట్టాయి. కానీ రాష్ట్రంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డానికి ఇప్పటిదాకా గనుకను కేటాయించలేదు. పెరుగుతున్న ఖర్చులు కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోతే డానికి భవిష్యత్తు ఉండదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/visakhapatnam-steel-plant-24-12649.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





