అప్పుల బాధతో... సొంత ఇంట్లోనే దోపిడీ

Publish Date:Oct 10, 2025

Advertisement

 

విశాఖలోని కంచరపాలెం ఇందిరానగర్ లో ధర్మాల  ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల క్రితం దోపిడీ జరిగింది జీవీఎంసీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు ఇంట్లో అతని తల్లి కొడుకు కృష్ణ కాంత్ మాత్రం ఉన్నారు అర్ధరాత్రి నిద్రపోతున్న దశలో ఇంటి వెనకనుంచి తలుపులు పగలగొట్టి నాన్నమ్మ మనవడు చేతులకు తాళ్లు కట్టి ముఖానికి ప్లాస్టర్ వేసి ఇంట్లో 12 తులాల బంగారం రెండున్నర లక్షల నగదును దోపిడీ చేశారు. ఆ అగంతకులు హిందీలో మాట్లాడారు దోపిడీ అనంతరం ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలోనే పరారయ్యారు. దీంతో ఆనంద్ కుమార్ రెడ్డి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తొలిత భావించారు.

.. విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు 
..
 కాంట్రాక్టర్ ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ విచారణలో విశాఖ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమ్మలేని నిజాలను చూడాల్సి వచ్చింది. దోపిడి అనంతరం పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు ఇంటి ఆవరణలో నిందితులు ఎత్తుకుపోయిన వాహనం నగర శివారులోని మధురవాడ వద్ద కనిపించింది. అనంతరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో ఆనంద్ కుమార్ రెడ్డి తనయుడు కృష్ణ కాంత్ దినచర్యను ఆరా తీశారు. దోపిడీ జరిగిన అర్ధరాత్రి అతను కొందరుతూ ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ జరిగింది. 

ఆ మేరకు విచారణ చేపట్టుగా వారంతా కృష్ణ కాంత్ స్నేహితులు గా తేలింది. పరపతి ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ అవసరాల సత్య సూర్యనారాయణ అనే ఈ ముగ్గురు దోపిడీ జరిగిన కృష్ణ కాంత్ స్నేహితులు వీరంతా విలాసాలకు అలవాటు పడ్డారు. దీంతో  సెల్ టవర్ల ద్వారా నిందితుల కదలికను వెంటాడారు. దోపిడీ జరిగిన రోజు వీరు కంచరపాలెం లో ఉన్నట్టు నిర్ధారణ అయింది ఆపై ఆ యువకులను పోలీసులు విచరించగా ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కృష్ణ కాంత్ ఇటీవల కాలంలో ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడ్డాడు. దీంతో ఇంట్లో ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అయింది. అప్పుల పాలయ్యాడు. దీని నుంచి బయట పడేందుకు ఇంట్లోనే దొంగతనం చేయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకోసం ముగ్గురు స్నేహితులను సిద్ధం చేశారు. 

ఇంట్లో తన తండ్రి లేని సమయంలో నాన్నమ్మతో ఒంటరిగా ఉన్నప్పుడు చేతులకు తాళ్లను కట్టి నోటికి ప్లాస్టర్ వేసి దొంగతనం చేయాలని అనంతరం పంచుకుందామని కృష్ణ గాని చెప్పాడు. నెల రోజులుగా చేస్తున్న ఆ ప్రయత్నం ఒకరోజు ఫలించింది కానీ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నలుగురు నిందితులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.... విలాసవంతమైన జీవితం గడపాలని యువత ఆలోచన చేయడంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత  బాచ్చి  తెలిపారు. అయితే నేరం చేసిన వ్యక్తులు పోలీసులకు చిక్కడం ఖాయమని తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులకు హితవు పలికారు

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.