తెలుగువారి ఉక్కు సంకల్పం.. విశాఖ ఉక్కు

Publish Date:Apr 13, 2023

Advertisement

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదం పుట్టి ఇప్పటికి 50 ఏళ్లు. ప్రస్తుత పరిణామాలు అందరికీ తెలిసినా 50 ఏళ్ల కిందటి విషయాలు కొందరికే తెలుసు. అసలు విశాఖ ఉక్కు వెనుక కథ ఎన్ని మలుపులు తిరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  అది 1963 సంవత్సరం సంగతి.  అంగ్లో అమెరికన్ కన్సార్టియమ్ విశాఖలో ఓ భారీ పరిశ్రమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదిక తయారు చేసి కేంద్రం ముందు ఉంచింది.

 విశాఖలో నైకా కేంద్రం ఉండటం ఒక కారణమైతే.. ఉత్తరాంధ్ర వెనుకబాటు ఇంకో కారణం. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం ఆ నివేదిక ఉద్దేశం.  అనేక సమావేశాల తరువాత విశాఖలో ఉక్కు కర్మాగారం స్థాపనకు కన్సార్టియం మొగ్గు చూపింది.  ఈ ప్రతిపాదనపై 1965 జులై 3న భారత పార్లమెంటులో చర్చ జరిగింది.  1966 జులై నెలలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రతిపాదనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే అసెంబ్లీతీర్మానంపై తిరిగి పార్లమెంటులో జరిగిన చర్చలో అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్లాంట్ స్థాపన సాధ్యం కాదని ప్రధాని ఇందిగా గాంధీ ప్రకటించారు. 

ప్రధాని ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. రాష్ట్రం నలుమూలలా ఆందోళనలు ప్రారంభం అయ్యాయి.  తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహామహులు ఆందోళనలకు నాయకత్వం వహించారు. ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఆందోళనకారులపై తుపాకులు గర్జించాయి.

పోలీసుల తూటాలకు 32 ప్రాణాలు నేలకొరిగాయి. విజయవాడ, గుంటూరులలో ఐదుగురు చొప్పున మరణించగా, విజయనగరంలో ఇద్దరు, కాకినాడ, వరంగల్, రాజమండ్రి, సీలేరు, పలాస, జగిత్యాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 32 మంది ప్రాణాలు వదిలారు. అక్టోబర్ 15, 1966న అమృతరావు ఆమరణ నిరాహార దీక్ తో ఆందోళనలు తారస్థాయికి చేరాయి.

దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.  21 రోజుల దీక్ష తరువాత విశాఖ ఉక్కుకు ఇందిర ఆమోదించారు.  దీంతో తెలుగు ప్రజలు కలలు గన్న విశాఖ ఉక్కుకు 1971 జనవరి20న ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు.  ప్లాంట్ నిర్మాణంలో అప్పటి రష్యా సాంకేతికతను వినియోగించారు. ఇంత చరిత్రకలిగిన విశాఖ ప్లాంట్ కు కురుపాం రాజవంశీయులు ఆరువేల ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అప్పటి పాలక వర్గాల పెద్ద మనసుకు నిదర్శనం.  తదనంతర పరిణామాలలో 1992లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రధాని పీవీ నరసింహరావు జాతియిక అంకితం చేశారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.