బ్రెయిన్ ట్యూమర్ అని... 11 ఏళ్లు చికిత్స.. ఆ తర్వాత తెలిసిన షాకింగ్ నిజామిదే!
Publish Date:Sep 17, 2026
Advertisement
వైద్య రంగంలో జరిగే చిన్నపాటి తప్పులు ఒక్కోసారి మనుషుల జీవితాలనే తీవ్రంగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన బెక్కీ జోన్స్ అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. 2012లో ఆమె తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆమెకు బ్రెయిన్ స్కాన్ నిర్వహించగా మెదడులో ఒక పెద్ద మచ్చ కనిపించింది. ఆ మచ్చను చూసి అది ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ అని, ప్రాణాంతక క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పదే పదే హెచ్చరించడంతో, ఆమె కీమోథెరపీ తీసుకోవడం ప్రారంభించారు. అది ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కొద్ది నెలల వ్యవధిలోనే ముగియాల్సిన మానసిక, శారీరక వేదన ఆమె జీవితంలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా నిత్యకృత్యమైంది. కీమోథెరపీ వల్ల కలిగే తీవ్రమైన పార్శ్య ప్రభావాలు, వెంట్రుకలు రాలిపోవడం, వికారంగా ఉండటం, శరీరం బలహీనపడటం వంటి నరకయాతనను ఆమె ప్రతిరోజూ అనుభవించారు. చికిత్స ఆపేస్తే ఎక్కడ క్యాన్సర్ తిరగబెట్టి తన ప్రాణాలను తీస్తుందో అనే భయంతోనే ఆమె 11 ఏళ్ల పాటు ఆ నరకాన్ని భరిస్తూ వచ్చారు. అయితే 2025లో ఆమె వైద్య రిపోర్టులను కొందరు న్యూరోసర్జన్లు మరియు రేడియాలజిస్టులు మరొకసారి క్షణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బెక్కీ జోన్స్‌కు అసలు ఎప్పుడూ బ్రెయిన్ క్యాన్సరే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. స్కాన్‌లో కనిపిస్తున్న మచ్చ క్యాన్సర్ ట్యూమర్ కాదని, అది ట్యూమర్‌ఫ్యాక్టివ్ డిమైలినేషన్ అనే అరుదైన నాడీ సంబంధిత సమస్య అని స్పష్టం చేశారు. నరాల పొర దెబ్బతినడం వల్ల వచ్చే ఒక రకమైన వాపు కారణంగా అది స్కాన్‌లో చూడటానికి హానికరమైన ట్యూమర్లా కనిపించిందని వివరించారు. ఈ నిజం తెలుసుకున్న బెక్కీ జోన్స్‌కు ఉపశమనం లభించడం కంటే తీవ్రమైన దిగ్భ్రాంతి, వేదన మిగిలాయి. తన జీవితంలోని అమూల్యమైన 11 సంవత్సరాల కాలాన్ని, ఆరోగ్యాన్ని కేవలం ఒక తప్పుడు వైద్య నిర్ధారణ వల్ల అనవసరంగా కోల్పోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు, పదేళ్లకు పైగా ఏ కారణం లేకుండానే నరకాన్ని అనుభవించాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అరుదైన లేదా క్లిష్టమైన వైద్య పరీక్షలు ఎదురైనప్పుడు సెకండ్ ఒపినియన్ ఎంత కీలకమో అందరికీ కన్నువిప్పు కలిగిస్తోంది. [ Becky Jones, Medical Misdiagnosis, Brain Tumor, Tumefactive Demyelination, Brain Scan, Chemotherapy, Neurology, Neurosurgery, Radiology, Second Opinion ]
http://www.teluguone.com/news/content/becky-jones-misdiagnosed-brain-cancer-story-25-231730.html




