జగన్‌కు ఊడిగం చేశారు.. ఇప్పుడు ఇరుక్కున్నారు!

Publish Date:Mar 23, 2025

Advertisement

ఎట్టకేలకు రాష్ట్ర సమాచారశాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి పాపం  పండింది.  వైసీపీ  హయాంలో అనేక అవినీతి,అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వెళ్లిపోయారు. జగన్‌ మీడియాతో పాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి  వందల కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో దోచిపెట్టారని ఆయనపై అభియోగాలున్నాయి. ఎట్టకేలకు విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయనకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేంద్ర సర్వీసులకు చెందిన ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ-మెయిల్‌ ద్వారానేగాక హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌కు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి, జగన్‌ పాదయాత్ర సమయంలోనే ఆయనకు మద్దతు ప్రకటించి జగన్ భజన మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. 2024 వరకు సమాచార శాఖ కమిషనర్‌గా విచ్చలవిడి వ్యవహారాలు చేపట్టారు. జగన్‌ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి గత ఏడాది గద్దెనెక్కిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విజయ్‌కుమార్‌రెడ్డిపై గుంటూరులో కేసు నమోదు చేశారు.

రాష్ట్ర సర్వీసుల నుంచి వెళ్లిపోతే, తన అవినీతి, అక్రమాలు బయటకు రావనీ,  తనను ఎవరూ ఏమీ చేయలేరని విజయ్‌కుమార్‌రెడ్డి భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వంలో అవినీతిపై ఆచితూచి చర్యలు తీసుకుంటుండడంతో, తనను ఏమీ చేయరనే ధీమాతో విజయ్‌కుమార్ కనిపించారు. అయితే, విజిలెన్స్‌ విచారణలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్ర మాలు బట్టబయలు కావడంతో ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. జగన్‌ అధి కారంలోకి రాకముందే, రాష్ట్ర సంపదను ఎలా జగన్‌కు దోచిపెట్టాలన్నదానిపై ఒప్పందం చేసుకు, రాష్ట్రానికి వచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డి వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోయారు. 

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన మొదటి పని పత్రికల టారిఫ్‌ పెంపుదల. పత్రికా యాజమాన్యాలు ఎవరూ అడగకపోయినా..అన్ని పత్రికల టారిఫ్‌ పెంచేశారు. ఎవరూ అడగకుండానే టారిఫ్‌లు పెంచడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం పెద్ద పత్రికలకే కాదు..చిన్న పత్రికలకు కూడా టారిఫ్‌ పెంచేశారు. ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేసి,  జగన్ మీడియాకు దోచిపెట్టకుండా అడ్డుకుంటారన్న భావనతో..అందిరికీ పెంచేశారట. 

అయితే రేట్లు పెంచారు కానీ, ఇతర పత్రికలకు ఐదేళ్లలో కనీసం ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, చిన్నపత్రికలకు ఎన్నోకొన్ని ప్రకటనలు ఇచ్చేవి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా, వారికీ ప్రకటనలు ఇచ్చేవి. కానీ జగన్‌, విజయ్‌కుమార్‌రెడ్డిలు ఐదేళ్లలో ఒక్క ప్రకటనా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్‌ సొంత మీడియాతోపాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు. 

ఇప్పుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ విచారణకు హాజరుకాకుండా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. విచారణకు రావాలని శుక్రవారం ఆయనకు నోటీసు ఇవ్వగా,  తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని, రానని.. వీలు చూసుకొని ఏప్రిల్‌లో వస్తానంటూ సమాధానమిచ్చారు. విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకున్నారు. అది విచారణలోనే ఉంది. అరెస్టు నుంచి ఆయనకు ఎలాంటి రక్షణ లేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మరోసారి ఫలానా తేదీలో విచారణకు రావాలంటూ నోటీసులివ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.