బెజవాడ మేయర్: స్పష్టమైన ఆధిక్యతలో వంగవీటి రాథాకృష్ణ: రెండో స్థానంలో ఏబీవీ.!

Publish Date:Nov 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  విజయవాడ మేయర్ స్థానానికి సంబంధించిన ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక  తెలుగుదేశం కూటమి అభ్యర్థి  అభ్యర్థి, జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్గమైన ఆధిక్యిన్ని ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతులో మేయర్ అభ్యర్థిగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక పోతే వంగవీటి రాధాకృష్ణ బెజవాడ నగరంలో తనకున్న విస్తృతమైన ప్రజాదరణకు తోడు కూటమి శ్రేణుల బలం తోడవడంతో ఆరంభం నుంచీ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ఒక్కో రౌండుకూ వంగవీటి రాధా ఆధిక్యం పెరుగుతూ వస్తున్నది. అలాగే విజయవాడ నగరంలోనిమెజారిటీ డివిజన్లలో తెలుగుదేశం కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు.

 

ఇక విజయవాడ మేయర్ బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు   రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మేధావులు, వామపక్షాల మద్దతుతో పాటు నగరంలోని విద్యావంతులైన ఓటర్ల మద్దతును పొందడంలో ఆయన సక్సెస్ అయ్యారని అవగతమౌతుంది. ఈ ప్రతిష్ఠాత్మక స్థానంలో వైసీపీ   అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమౌతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావించినప్పటికీ, నగర ఓటర్లు కూటమి అభ్యర్థికే జైకొడుతున్నారని కౌంటింగ్ లో వెల్లడౌతున్న ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది. 


 ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణ,  ఏబీ వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు పోకుండా హుందాతనంతో వ్యవహరించడం విశేషం. నగరాభివృద్ధికి సంబంధించి మేధావుల, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరిస్తానని రాధా ప్రకటించగా, ఇది కేవలం సిద్ధాంతాల పోరాటమని ఏబీవీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎన్నికల పోరులో బెజవాడ ప్రజల మొగ్గు తెలుగుదేశం కూటమి వైపే ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి స్పష్టంగా అవగతమౌతోంది.  తుది రౌండ్ల లెక్కింపు కూడా త్వరలోనే పూర్తయిన అనంతరం  విజయవాడ కొత్త మేయర్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.  


[Vijayawada Mayor Election Results, Vangaveeti Radha Leading, AB Venkateswara Rao, Second Place, Vijayawada Corporation Counting, AP Local Body Polls, Telugu One] 

By
en-us Political News

  
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.