నేను గానీ, ఒక్క సైగ గానీ చేస్తే.. ప్రత్యర్థులకు జగన్ వార్నింగ్.!

Publish Date:Nov 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్ రెడ్డి పులివెందులలో   మున్సిపల్ ఎన్నికల సందర్భంగా  ప్రత్యర్థులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంత అడ్డా, తనకు కంచుకోట లాంటి పులివెందులలో  స్థానిక పోలింగ్ సందర్భంగా వైసీపీకి ప్రతికూల పరిస్థితులు కనిపించడంతో ఆయన పరిధి దాటి తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులను బెదరించే రీతిలో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారు.  

ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మున్సిపల్ పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న సమయంలో పలు చోట్ల వ్యతిరేకత ఎదుర్కొన్నారు.  ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆయనను నేరుగా అడ్డుకుని ఆరోపణలు గుప్పించడం ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ అనూహ్య పరిణామాల మధ్య అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ తరఫున   మొత్తం ఎనభై మంది ఏజెంట్లు ఉంటే, కేవలం పది చోట్ల మాత్రమే అనుమతించి మిగిలిన డెబ్బై చోట్ల వారిని అణచివేశారని ఆయన ఆరోపించారు.

పోలింగ్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతూ పోలీసుల అండతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపిందని జగన్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లినప్పటికీ,   లోపలకు అనుమతించకపోవడంతో ఆయన కార్యాలయం వెలుపలే పార్టీ శ్రేణులు, బాధితులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు మరియు నాయకులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ఆయన చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.

తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.  పులివెందులలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని  డిమాండ్ చేశారు.ఈ మొత్తం వ్యవహారంపై అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతలే  కావాలని ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు యత్నించారని విమర్శించింది.  ఓటమి భయంతోనే జగన్ బెదరింపు నాటకాలకు  తెరలేపారని ఆరోపించింది.   మొత్తం మీద జగన్ కు సొంత గడ్డ, సొంత అడ్డాలోనూ అనూహ్య రీతిలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. 

[Protests Pulivendula Against Jagan,  Pulivendula Municipal Elections, Jagan Violent Warnin, Pulivendula Election, Telugu One]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.