రగిలిపోతున్నరాములమ్మ..

Publish Date:Aug 19, 2022

Advertisement

కమలనాథులు తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బి.జె.పి రాష్ట్ర నాయకత్వంపై విజయ శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్రైర్ బ్రాండ్ అయిన తనను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సేవలను ఉపయోగించుకోవడం లేదని ఆమె అసహనంగా ఉన్నారు.

ఏదైనా బాధ్యతలు అప్పగించి పని చేయమంటే చేస్తాం కానీ ఏ బాధ్యతలూ ఇవ్వకుండా పని చేయడం లేదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తాను   అసంతృప్తి గా ఉన్నానో,లేదో పార్టీ నాయకులనే అడగాలన్న విజయశాంతి  ఉద్యమకారిణిగా   ప్రజల గుండెలలో తనకు సుస్థిర స్థానం ఉందని దాన్ని ఎవరు తీయలేరని చెప్పారు. పార్టీలో తన పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్ళని పాతరేస్తే మంచిదని పేర్కొన్నారు.  తెలంగాణ ఉద్యమం కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడిన విజయశాంతి ఆ తరువాత తన పార్టీని  ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తో విలీనం చేశారు.  కేసీఆర్   చెల్లిగా మారి.. టీఆర్ఎస్ లో నంబర్2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమెను కేసీఆర్ ఎంపీని చేసి ఢిల్లీకి కూడా పంపించారు.

అయితే కేసీఆర్ తో విభేదాలతో రాములమ్మ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం  కాంగ్రెస్ లో చేరారు. తొలి నాళ్లలో విజయశాంతికి కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యతే దక్కింది. పార్టీ  ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు సైతం అప్పగించారు. ఆమె కోరినట్లుగానే మెదక్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ ఇచ్చింది.

అయితే ఆ  ఎన్నికలలో విజయశాంతి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందంటూ అలిగిన విజయశాంతి తదననంతరం కమలం గూటికి చేరారు. బీజేపీలో కూడా తొలి నాళ్లలో విజయశాంతికి మంచి ప్రాధాన్యతే లభించింది. ఆ తరువాత తరువాత అంటే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ అయిన తరువాత విజయశాంతికి ప్రాధాన్యత ఒకింత  తగ్గిందనే చెప్పాలి.   తెలంగాణలో అధికారం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. అందుకు అనుగుణంగా వరుస కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.

ఈనేపథ్యలోనే పార్టీలో విజయశాంతికి గళమెత్తే అవకాశం రావడం లేదు. బీజేపీ తన సేవలను ఉపయోగించుకోవడం లేదనీ, తనను నిశబ్దంలో ఉంచేస్తోందని రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తాజాగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా సర్వాయి పాపన్న జయంతిలో కనీసం మాట్లాడే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి భగ్గుమనడం ఆమె రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉంటుందా అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది,

 
 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.