భార‌త్‌లో కుల‌వివ‌క్ష‌, పేద‌రికం ప‌డుగుపేక‌లు.. ఐరాస నివేదిక‌

Publish Date:Aug 19, 2022

Advertisement

ఎంత క‌డిగినా మురికిపోకుండా ఉంటే ఇబ్బందిక‌ర‌మే. ఎంత చెప్పినా పాత పంథాలోనే వెళు తూంటే ఎవ రేమీ చేయ‌లేరు. అనాదిగా దేశంలో ఉన్న కుల వివ‌క్ష‌, పేద‌రికం, బాల‌కార్మిక వ్య‌వ‌స్థ‌ల గురించి ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది చాలాకాలం నుంచి విప‌క్షాలు, ప్ర‌జాసంఘాల మాట‌. కుల వ్య‌వ‌ స్థ‌ను నిర్మూలించ‌డం అనేది ప్ర‌భుత్వాల‌తోపాటు, ప్ర‌జ‌లూ త‌ల‌చుకోవాలి. దీన్ని గురించి చ‌ర్చోప‌ చ‌ర్చ‌లు జ‌రిగాయి, జ‌రుగుతాయి, ఎంద‌రో మేథావులు దీన్ని గురించి అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూ స‌మా జం మున్ముందు దారుణంగా త‌యార‌వుతుంద‌నీ హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. కానీ మ‌లికిని అంత తొంద‌ ర‌గా వ‌దిలించ‌డ‌మూ క‌ష్ట‌మే. స‌మాజంలో రాని మార్పును అమాంతం కొద్దికాలంలో తెచ్చేయ‌ గ‌ల‌మ‌ను కోవ‌డం పొరపాటే. స‌మాజంలో అన్ని సంద‌ర్భాల్లోనూ కులం పేర జ‌రుగుతున్న దాడులు, హ‌త్య‌లు మ‌న స‌మాజం ఏమాత్రం మార‌క‌పోగా మ‌రింత వెన‌క‌డుగు వేస్తోంద‌నే సామాజిక విశ్లేష‌కుల అభిప్రాయం. 

భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి  ఉ న్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని, అన్ని అంశాల్లోనూ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికి నిరాకరిస్తున్నారని తెలిపింది. ఐరాస మానవ హక్కుల మండలి ప్రతినిధి టొమోయో ఒబొకట రూపొందించిన ఈ నివేదికను ఇటీవ‌ల‌ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీకి సమర్పించారు.  ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బాలకార్మిక వ్యవస్థ ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆసియా, పసిఫిక్‌, మధ్యప్రాఛ్యం, అమెరికా, ఐరోపాలలో నాలుగు నుంచి ఆరు శాతం పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని, ఆఫ్రికా లో మరీ ఎక్కువగా 21.6 శాతం ఉన్నా రని నివేదిక వెల్లడించింది. 

ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ కేటాయింపుల్లో అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో వారికి చాలా పరిమితంగానే న్యాయం అందుతోందని తెలిపింది. వృత్తి, సంతతి ఆధా రంగా వారి పట్ల వివక్ష కొనసాగుతోందని తెలిపింది. కుల‌వివ‌క్ష అంత‌మొందించేందుకు కంక‌ణం క‌ట్టు కున్నామ‌ని ప్ర‌చారాలే త‌ప్ప వాస్త‌వానికి అందుకు గ‌ట్టి చ‌ర్య‌లేవీ తీసుకోవ‌డం లేదు. అన్ని ప్రాంతాల్లో, అన్ని సంద‌ర్భాల్లోనూ కుల‌వివ‌క్ష త‌లెత్తుతోంది. దీన్ని రాజకీయాల‌కు ఆస‌రాగా చేసుకుని ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల్లో మ‌రింత సందిగ్ధ‌త క‌ల్పించే య‌త్న‌మే చేస్తున్నారేగాని ఆ గోడ‌లు కూల్చేందు కు ధైర్యం చేయ‌లేకపోతున్నాయి. సామాజిక‌వేత్త‌లు, ఆధ్యాత్మిక చింత‌నాప‌రులు అనేక‌మంది  చాలా కాలం నుంచి చేస్తున్న కృషి ఏ మాత్రం ఫ‌లించ‌డం లేదు. దీనికి తోడు ఇటీవ‌లి కాలంలో ప‌రువు హ‌త్య‌ల పేరుతో కుల‌వివ‌క్ష‌త‌ను మ‌రింత ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నిస్తున్నాం. 

దక్షిణాసియాలో దళితులు వెట్టి చాకిరీలో మగ్గిపోతున్నారని తెలిపింది. అట్టడుగు వర్గాల్లో బాల్య వివా హాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బలవంతపు పెళ్లిళ్లు పాకిస్థాన్‌లో ఎక్కువగానూ, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, సోమాలియా దేశాల్లో తక్కువగానూ జరుగుతున్నాయని తెలిపింది. ప‌ట్ట‌ణాల్లో పెద్ద పెద్ద క‌ర్మాగారాల్లో, ప‌రిశ్ర‌మ‌ల్లో, గ్రామాల్లో కుటీర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వెట్టి చాకిరీ ఇంకా రాజ్యం చేస్తోంద‌న్న‌ది తెలిసిందే. ముఖ్యంగా ద‌ళితులు ఈప‌రంగా దారుణ ప‌రిస్థితులు ఎదుర్కొం టున్నారు. వెట్టిచాకిరీని అరిక‌ట్టేందుకు ప్ర‌జాసంఘాలు ఉద్య‌మిస్తూనే ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లం ద‌క్క‌డం లేదు. కాగా, మైనారిటీలు, వలస కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ప్రశంసనీయమైన పాత్ర పోషి స్తున్నాయని నివేదిక కొనియాడింది. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.