విజయసాయి కొత్త పార్టీ.. చానల్ అందుకేనా ?

Publish Date:Oct 13, 2022

Advertisement

ఒక జర్నలిస్ట్ కు సొంతంగా పత్రిక లేదా ఓ వెబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? సహజంగా, ఉన్న ఉద్యోగం ఊడి, కొత్త ఉద్యోగం ఏదీ దొరకని సమయంలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే, సొంతంగా ఏదో ఒకటి చేద్దామనే అలోచన పుడుతుంది. సరే, ఆలా ఆలోచన చేసిన జర్నలిస్టులు చాలా వరకు చేతులు కాల్చుకుని మళ్ళీ చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోయిన వారే అనుకోండి, అది వేరే విషయం.  జర్నలిస్టుల విషయాన్ని కాసేపు పక్కన పెట్టి రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్న పార్టీలో ఉక్కపోత మొదలై, పక్క పార్టీలతో పని కాదనుకున్నప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తారు. అఫ్కోర్స్ అక్కడా సక్సెస్ రేటు తక్కువే అనుకోండి. అయినా ఉన్న పార్టీలో ఉక్కపోత తట్టుకోలేక సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేసే రాజకీయ నాయకులు  మంచి కాసుల పార్టీ అయితే, పార్టీ కంటే ముందే సొంతంగా ఒక  న్యూస్ పేపర్, ఒక న్యూస్ చానల్ ప్లాన్ చేస్తారు.  

అందుకే కావచ్చును వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు హటాత్తుగా సొంతగా న్యూస్ చానల్ పెడుతున్నానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విజయసాయి, సొంత చానల్ తో ఆగుతారా, సొంత పార్టీ వరకు వెళతారా అనే చర్చ, వైసీపీ వర్గాల్లోనే మొదలైందని అంటున్నారు. అంతే కాదు,ఢిల్లీ  స్థాయిలో ఇందుకు సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగిందని వైసీపీలో వినవస్తోంది. వైఎస్ కుటుంబ సభ్యులను ముందుంచి, విజయసాయి రాజకీయంగా ముందదుగు వేసే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని అంటున్నారు.  ఢిల్లీ పెద్దలతో పాటుగా  పొరుగు రాష్ట్రానికి  చెందిన ముఖ్యనేత ఒకరు తెర వెనక నుంచ కథ నడిపిస్తునట్లు తెలుస్తోంది. అందుకే, విజయ సాయి, ఓపెన్ గా చానల్ పెడుతున్నానని ప్రకటించారని  అంటున్నారు.    

వైసీపీకి సాక్షి న్యూస్ పేపర్, న్యూస్ చానల్ ఉన్నాయి. అంతే కాదు, ఆ రెండు పత్రికలు,  ఆ ఒక్క చానల్ మినహా మిగిలిన న్యూస్ పేపర్లు, న్యూస్ చానల్స్ చాలా వరకు జగన్  రెడ్డి సువార్త పుత్రికలు అన్నట్లుగానే, వైసీపీ ప్రభుత్వాన్ని మోస్తున్నాయి.  జగన్ రెడ్డితో చక్కని ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అటువంటప్పుడు  వైసీపీకి ఇప్పుడు మరో చానల్ అవసరం ఏమొచ్చింది? అంటే, ఛానల్ అవసరం వచ్చింది  వైసీపీకి కాదు. జగన్ రెడ్డికీ కాదు విజయ సాయి రెడ్డికే  ఆ అవసరం వచ్చిందని  లోగుట్టు తెలిసిన, విజయసాయి సన్నిహిత మీడియా మిత్రులు చెపుతున్న మాట.

నిజమే  కారణాలు ఏవైనా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు. అదీ తెలుస్తూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతం, ఫ్లడ్ గేట్స్ తెరిచినట్లుగా బయటకు వస్తోంది. విజయ సాయి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా   జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ  ఆయనకు అండగా నిలవడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించడం లేదు. నిజానికి, విజయసాయిరెడ్డి భూదందాల వ్యవహారాలన్నీ ప్రభుత్వ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయని అంటున్నారు.  

ఇక సాక్షి పత్రిక, చానల్ సంగతి అయితే, చెప్పనే అక్కర లేదు. ఇతర పత్రికల్లో వైసీపీ నేతలఫై ఏ చిన్న ఆరోపణ వచ్చినా, కలాలను ఎక్కుపెట్టే సాక్షి విపక్షాలు విజయ సాయిపై విరుచుకు పడుతున్నా కిమ్మనడం లేదు.  దీంతో విజయసాయి రెడ్డికి సీన్ అర్ధమైందని అంటున్నారు. అందుకే నెపాన్ని సాక్షిపై నెట్టి చానల్ ఆలోచనను బయట పెట్టారని అంటున్నారు.  తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను సాక్షి టీవీ సమర్ధవంతంగా తిప్పి కొట్టడంలో విఫల  మవుతోందని, అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. 

అదలా ఉంటే  నిజానికి జగన్ రెడ్డి, విజయ సాయి మధ్య చాలా కాలంగా  ప్రచ్చన్న యుద్ధం సాగుతోందని, ఏదో ఒక రోజున ప్రచ్చన యుద్ధం ప్రత్యక్షయుద్ధంగా మారక తప్పదని అంటున్నారు. అది గ్రహించే విజయ సాయి యుద్ద సన్నాహాలు ప్రారంభించారని అంటున్నారు. నిజానికి వైసీపీ సీనియర్ నేతలు చాలా మందిలో అసమ్మతి బుసలు కొడుతోంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రిపై కంటే, ముఖ్యమంత్రి చుట్టూ చేరిన కోటరీపై పార్టీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రిని వారే తప్పుదారి పట్టిస్తున్నారని అంటున్నారు.

అంతే కాకుండా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే ఎమ్మెల్యేలు, మంత్రులకు బహిరంగంగానే హెచ్చరికలు చేయడం, పని తీరు మెరుగు పరచుకోకపోతే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని చెప్పడంతో, పార్టీలో తమ భవిష్యత్ ఏమిటనే విషయంలో సందిగ్దంలో  ఉన్నారు. ఈ నేపధ్యంలో పిల్లి  మెడలో తిరుగుబాటు గంట కట్టేది ఎవరని ఎదురుచూస్తున్న నాయకులు  విజయ సాయిలో ఆ స్పార్క్ చూస్తున్నారని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా, 2024కు ముందు వైసీపీ నెంబర్ 2’ తధ్యమని అంటున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.