విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Publish Date:May 10, 2026

Advertisement

 

విజయ్ పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించిన మోదీ..

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కలిసి పని చేస్తామని హామీ..

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాల మధ్య నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన C. జోసెఫ్ విజయ్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలపడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని, విజయ్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన విజయ్ తన ప్రసంగంతో సభలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించారు. తాను ప్రజల ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడినేనని,అన్నగా-తమ్ముడిగా ఎప్పుడూ ప్రజలతో ఉంటానని చెప్పారు. పేదరికం అంటే ఏమిటో తనకు తెలుసని, ప్రజలు ప్రేమగా రాజకీయాల్లోకి రావాలని పిలిచారని గుర్తుచేసుకున్నారు. అసాధ్యమైన హామీలు ఇవ్వబోనని, సాధ్యమైనవి మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. తనతో ప్రయాణం చేస్తున్న ప్రజలను ఎప్పటికీ మోసం చేయనని హామీ ఇచ్చిన ఆయన, తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని కూడా వెల్లడించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న తొలి నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు తొలి సంతకం చేసిన ఆయన, మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని కూడా సంతకం చేశారు. ఈ నిర్ణయాలు ప్రజలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి.

సామాన్యుడిగా ప్రారంభించి ముఖ్యమంత్రిగా ఎదిగానని చెప్పిన విజయ్, తన కష్టకాలంలో నాతో నిలిచిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా తెలిపారు. “మీ సోదరుడు ఇప్పుడు సీఎం అయ్యాడు” అన్న ఆయన మాటలు సభలో ఉన్నవారిని కదిలించాయి. తనను విమర్శించే వారు కూడా తన శ్రేయోభిలాషులేనని చెప్పిన విజయ్, యువత తన వెన్నంటి నిలిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త దిశ ప్రారంభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.