అండమాన్ లో అంతులేని చమురు నిక్షేపాలు

Publish Date:Jun 19, 2025

Advertisement

పెట్రోల్ సమస్యకు  పెర్మనెంట్ సొల్యూషన్

కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాని సామెత.. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే  రోజులు వచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా? అంటే  అవుననే అంటున్నారు  కేంద్ర పెట్రోలియం ,సహజ వనరుల శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరీ. అవును  అండమాన్ ద్వీప సముద్ర గర్భంలో  బయట పడిన చమురు నిక్షేపాలు మన దేశ  చమురు కరవును శాశ్వతంగా తొలిగించేంత పెద్ద మొత్తంలో ఉన్నాయని  కేంద్ర మంత్రి  స్వయంగా చెప్పారు.  నీవినీఎరుగని రీతిలో, రెండు వేల సంవత్సరాల పాటు, మన దేశ చమురు అవసరాలను తీర్చగల స్థాయిలో  అడమాన్ లో చమురు నిక్షేపాలు ఉన్నట్టు చెపుతున్నారు. 

నిజానికి, అండమాన్ ద్వీపంలో చమురు నిక్షేపాలున్న విషయం ఇప్పడు కాదు..  ఎప్పుడో, 1970- 80 దశకంలో అంటే ఇంచు మించుగా అర్థ శతాబ్దికి (50 ఏళ్ల) పూర్వమే గుర్తించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చి పోయిన ప్రభుత్వాలు కానీ ముందడుగు వేసే సాహసం చేయలేదు. బహుశా.. అప్పటికి ఉన్న సాంకేతిక, ఆర్ధిక పరిమితుల దృష్ట్యా.. అప్పటి ప్రభుత్వాలు ముందడుగు వేసి ఉండక పోవచ్చును.  అత్యంత సంక్లిష్ట వాతావరణ, భౌగోళిక పరిస్థితుల నడుమ..  అది కూడా సముద్ర గర్భం లోతుల్లోకి వెళ్లి చమురు నిక్షేపాలను వెలికితీయడం అప్పుడే కాదు, ఇప్పటికీ కొంత వరకు అసాధ్యమే.  అందుకే అప్పటి ప్రభుత్వాలు సాహసించి ముందడుగు వేయలేక పోయాయి కావచ్చును.  

సరే. అదంతా గతం.  ప్రస్తుతం పరిస్థితులలో మార్పు వచ్చింది. ముఖ్యంగా..  గడచిన 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన మొదలు అంతరిక్ష పరిశోధనల వరకూ ప్రతి రంగంలోనూ, సాహసం చేయరా ...డింభకా టైపులో.. సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. అందుకు తోడు ఈ రోజున ఆయిల్ రిఫైనరీలో మన దేశం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. నిజానికి, ఆయిల్ రిఫైనరీ రంగంలో మన దేశం చమురుతో తలలు పండిన దేశాలకంటే చాలా  ముందు వరసలో వుందనీ.. అందుకే మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

అవును..  ఏక కాలంలో 26 వేల బోర్లు వేసి, చమురు నిక్షేపాలను అన్వేషించడం అంటే మాములు విషయం కాదు. అయినా..  మోదీ ప్రభుత్వం సాహసించి ముందుగువేసింది. అదృష్టం ఎగసి పడింది. ఈ విషయాన్ని, కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి  హరిదీప్ సింగ్ పూరీ, ఒక అంగ్ల టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
అయితే..  ఇల్లు అలకగానే పండగ రాదు, చమురు నిక్షేపాలు కనుగొన్నంత మాత్రాన, పెట్రోల్, డీజీల్ పెట్రోల్ బంకుల్లోకి, మన వాహనాల్లోకి వచ్చేయదు. ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంతో, ఎంతో మెటిక్యులస్ గా ప్లాన్ చేస్తేనే కానీ  పని జరగదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన, ఓఎన్జీసీ, భారత్, హెచ్ పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు  చమురు తవ్వకాలు, నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. మరోవంక రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు చమురు రంగంలో చురుగ్గా పని చేస్తున్నాయి. సో.. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతోనే అండమాన్ ఆపరేషన్స్ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తునట్లు మంత్రి చూచాయగా చెప్పారు.  
అదలా ఉంచితే..  అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగి, అండమాన్  సముద్ర గర్భంలో దాగున్న  సుమారు 1,160 బిలియన్ బ్యారెళ్ళ చమురు నిక్షేపాలను వెలికి  తీయగలిగితే.. అత్యధిక చమురు నిల్వలు ఉన్న తొలి 20 దేశాల్లో మన దేశం స్థానం సముచిత స్థానం సంపాదించుకుంటుంది. అంతే కాదు..  ప్రస్తుత చమురు దిగుమతులు 85 శాతం మేర తగ్గి, రోజుకు కేవలం 15 శాతం మాత్రమే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. అదే జరిగితే..  చమురు దిగిమతి వ్యయం ప్రస్తుత  రూ. 11 లక్ష కోట్ల నుంచి కేవలం రూ.1.75 లక్షల కోట్లకు దిగివస్తుంది. అంటే ఏటా.. నికరంగా . రూ. 9 లక్షల కోట్లు ఆదా అవుతాయి..  అంతే కాదు.. మనం మన చమురు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.  కలిసొచ్చే రోజొస్తే  .. నడిచొచ్చే బిడ్డడు పుడతాడంటే   ఇదే కదా.

By
en-us Political News

  
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.