తండ్రి ఎమ్మెల్సీ.. కుమారుడు ఎమ్మెల్యే.!
Publish Date:Aug 20, 2026
Advertisement
తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 19) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఏక కాలంలో చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్ననట్లైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు వర్ల కుటుంబం చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వర్ల రామయ్య తెలుగుదేశంలో కీలకమైన నాయకుడిగా, విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలబడి, పార్టీ సిద్ధాంతాలను గట్టిగా వినిపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య సేవలకు గుర్తింపుగా, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగానూ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగిన గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు ఏకకాలంలో చట్టసభలలో సభ్యులుగా ఉండటం ఇదే ప్రథమం కాదు కానీ, ఇది అరుదుగా జరిగే విషయం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్.. వంటి ఇలా తండ్రీ కొడుకులు ఒకే సమయంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా వారి సరసన చేరారు. Varla Ramaiah MLC, Varla Kumar Raja Pamarru MLA, AP Politics, Father MLC Son MLA, Andhra Pradesh, TeluguOne
http://www.teluguone.com/news/content/varla-ramaiah-mlc-25-229346.html





