వనితను చూసి సుచరిత ఫుల్ హ్యాపీ!?
Publish Date:Apr 23, 2022
Advertisement
అవును, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రస్తుత హోంశాఖ మంత్రి తానేటి వనిత మాటలను చూసి మనసులో తెగ సంబరపడిపోతున్నారట. ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనను మంత్రి మండలి నుంచి తప్పించి.. తన ప్లేస్‌లో వనితను హోంమంత్రిగా నియమించి సీఎం జగన్ ఎంత తప్పు చేశారో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చిందని సుచరిత తన సన్నిహితుల దగ్గర సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి పదవి రాలేదని తాను అలిగితే.. తనను బుజ్జగించకుండా పక్కనపెట్టేసి అవమానించారని.. తీవ్ర అసమనంతో, అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి సుచరితకు.. తాజా మంత్రి తానేటి వనిత వ్యవహారం కాస్త తృప్తిని, ఆనందాన్ని ఇచ్చాయంటున్నారు. ఎందుకంటే... ఇప్పుడు సోషల్ మీడియాకు హోంమంత్రి వనితనే ఫుల్ టార్గెట్. ఆమె వ్యాఖ్యలపై ఫుల్ ట్రోలింగ్ జరుగుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అత్యాచార ఘటనపై హోంమంత్రిగా ఆమెకు కనీస అవగాహన కూడా లేకపోవడం.. అధికారులను ఆ వివరాలు అడిగి తెలుసుకుంటూ.. దొరికిపోవడంతో ఆమె ట్రోలర్స్‌కు, ప్రతిపక్షాలకు చేతి నిండా పని కల్పించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి అత్యాచార ఘటన యావత్ తెలుగుజాతిని కలిచివేస్తే.. హోంమంత్రి తానేటి వనిత మాత్రం ఎలాంటి ప్రాధమిక సమాచారం లేకుండా మీడియా ముందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. మీడియా మైక్‌లు ఆన్‌లో లేవనుకున్నారో ఏమో.. అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇవాళ డేట్ ఎంత? ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ అధికారులను సమాచారం అడిగి తెలుసుకోవడం.. అదికాస్తా రికార్డు కావడం.. ఆ వీడియో ఫుల్ వైరల్ కావడంతో ప్రభుత్వ పరువంతా పోయింది. హోంమంత్రిగా ఉండికూడా.. అంత ఘోరం జరిగితే కూడా.. కనీస సమాచారం లేకుండా ఎలా ఉంటారు? ఆమె హోంమంత్రిగా ఎలా పనికి వస్తారు? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు, ట్రోల్స్ నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వనీత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదంతా చూస్తూ.. మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం లోలోన తెగ ఖుషీ అవుతున్నారని ఆమె అనుచరులే అంటున్నారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పని చేసే దానినని.. కొత్త మంత్రి ఇలా మినిమమ్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాట్లాడి.. ఇటు ప్రభుత్వ పరువు, అటు పార్టీ పరువు రెండూ మంటగలిపారని.. తనను కాదనుకున్నందుకు.. ఏరికోరి వనితను కేబినెట్‌లోకి తెచ్చిపెట్టుకున్నందుకు.. తగిన శాస్త్రి జరిగిందంటూ.. సుచరిత తెగ సంతోష పడుతున్నారని చెబుతున్నారు. తనను అవమానించినందుకే, తన కడుపుమంట ఇలా వారికి తగిలిందని శాపనార్థాలు కూడా పెడుతున్నారట మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.
http://www.teluguone.com/news/content/vanitha-episode-become-hot-topic-in-ycp-25-134865.html