వంగవీటి ఎపిసోడ్ లో  వైసీపీకి షాక్..

Publish Date:Jan 2, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో రాజకీయ పండితులకు సైతం ఉహకు అందడం లేదని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పొలిటికల్ టెంపరేచర్లు పెంచేస్తోంది. ఓ వంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముందస్తుకు మేము రెడీ, అంటూ ప్రకటించారు. మరోవంక బీజేపీ నాయకులు వివాదస్పద వ్యాఖ్యలతో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో వంక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, బీజేపీ పొత్తు విషయంలో స్పష్టత ఇస్తూనే సందేహాలకూ అవకాశం కలిపోస్తోంది. మొత్తానికి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.  

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, రాష్ట్రంలో రాజకీయ, కుల సమీకరణలలో మార్పుకు సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రధాన అధికార అధిపత్య కులాలలో, సంఖ్యాపరంగా ప్రధమ స్థానంలో,   అధికార పదవుల్లో అట్టడుగు స్థానంలో ఉన్న కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చింది. ఇతర బీసీకులాలను కలుపుకుని,ముదుకు సాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. అన్ని పార్టీలలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులు ఏకమయ్యే లేదా ఏకంచేసే ప్రయత్నాలు మరో మారు తెరమీదకు వచ్చాయి.అయితే, పీరియాడికల్’గా పుష్కరానికోసారి లేదా పదేళ్ళకోమారు కాపుల్లో ‘టెంపరరీ’ చైతన్యం రావడం, ఆ తర్వాత సర్దుకు పోవడం చూస్తూనే ఉన్నామని, అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా అది వేరే విషయం అనుకోండి.  

అయితే,రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు వైసీపీ, తెలుగు దేశం కాపు ఓటును తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుతం టాక్ అఫ్ ది స్టేట్’ గా చర్చ జరుగతున్న వంగవీటి రాధా ‘ రెక్కి’  వ్యహరంలో ఇటు వైసీపీ, అటు తెలుగు దేశం పార్టీలు, చాకచక్యంగా పావులు కదుపుతున్నాయి. రాధా తండ్రి రంగాకు కాపు సామాజిక వర్గంలో ఈనాటికీ ఉన్న పట్టును  సొంతం  చేసుకునేందుకు, వైసీపీ, తెలుగు దేశం ...పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈపోటీలో వైసీపీ ముందడుగు వేసినా, నేరుగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడంతో,సీన్ రివర్స్ అయిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. మంత్రి  కొడాలి నానీ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమకు వంగవీటి రాధాతో ఉన్నా వ్యక్తిగత స్నేహాన్ని ఉపయోగించుకుని ఆయన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధాతో కలసి పాల్గొన్నారు. అయితే అదే సభలో రాధా తన హత్యకోసం రెక్కీ జరిగిందని సంచలన కామెంట్లు చేయడంతో.. కథ కొత్తమలుపు తిరిగింది. విషయం ముఖ్యమంత్రి కోర్టుకు చేరింది. మంత్రి నాని చొరవతోనే కావచ్చు ముఖ్యమంత్రి రాధాకు గన్ మెన్ల సంఖ్యను పెంచేలా సీఎం ఆదేశాలిచ్చారు. అయితే రాధా తనకు గన్ మెన్లు వద్దని తిప్పి పంపించేశారు. మరో వంక రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది వైసీపీ కీలక నేత  అనుచరుడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు, వ్యూహాత్మకంగా పావులు కదిపి, రాధా తెలుగు దేశం పార్టీ వీడి వైసీపీలోకి వాలుతున్నారు అనే పుకార్లకు బ్రేక్ వేశారు. ముందు రాధాతో  ఫోనులో మాట్లాడారు ... అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాధ  ఇంటివద్ద రెక్కీ’ నిర్వహించిన వారిపై  చర్యలు తీసుకోవాలని నేరుగా డీజీపీకి లేఖ రాశారు. చివరకు రాధా ఇంటికి వెళ్లి రెక్కీ వ్యవహరం పూర్వా పరాలు అన్నీ తెలుసుకున్నారు. రెక్కీ చేసినవారెవరో తేల్చాలని, వారిని అరెస్ట్ చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో  పార్టీలో రాధా రాజకీయ భవిష్యత్’కు సంబంధించి గట్టి హమీ ఇచ్చారని తెలుస్తోంది.  పార్టీలో ఆయనకు కచ్చితంగా గౌరవం ఉంటుందని.. బాధ్యతలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి కీలక పదవిపై కూడా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అధినేత స్వయంగా వచ్చి హామి ఇవ్వడంతో వంగవీటి రాధా ఇక టీడీపీని వీడే అవకాశం లేనట్టే..అంటున్నారు. దీంతో, రాధా ఎపిసోడ్’లో చంద్రబాబు పైచేయి సాధించారు.


    

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.