జగన్ పక్కన పెట్టేశారా?.. వంశీ కొంపమునిగినట్లేనా?

Publish Date:Aug 28, 2023

Advertisement

అలా  వైసీపీకి రాజీనామా చేసి.. ఇలా తెలుగుదేశంలో  చేరగానే యార్లగడ్డ వెంకట్రావ్‌ని గన్నవరం పార్టీ ఇన్‌చార్జీగా తెలుగుదేశం అగ్రనాయకత్వం నియమించేసింది. దీంతో యార్లగడ్డ.. త్వరలో గన్నవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే నియోజకవర్గంలో పలు మండలాల్లోని  వైసీపీ  శ్రేణులు.. గన్నవరం వచ్చి మరీ.. వెంకట్రావ్ సమక్షంలో పసుపు పార్టీ తీర్థం పుచ్చేసుకుంటున్నాయి.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ  అభ్యర్థి ఎవరు? వల్లభనేని వంశీనా? లేక  దుట్టా రామచంద్రరావా? అనే ఓ చర్చ నియోజవకర్గంలో జోరందుకుంది. కారణమేమిటంటే.. వచ్చే ఎన్నికల్లో  వైసీపీ  అభ్యర్థిగా దుట్టా రామచంద్రరావుని బరిలోకి దింపేందుకు ఆ పార్టీ ధ్యక్షుడు, ముఖ్యమంత్రి  జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌లో గన్నవరం నియోజకవర్గ నేత దుట్టా రామచంద్రరావుతోపాటు ఆయన కుమార్తె, అల్లుడు.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గన్నవరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెడతామంటూ దుట్టా రామచంద్రరావుకు   జగన్ హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే సీఎం జగన్‌తో భేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు.. మీడియాతో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారంటున్నారు. 

మరోవైపు రానున్న ఎన్నికల్లో గన్నవరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీనే అంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే నియోజకవర్గంలో కొన సాగుతోంది. కానీ నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేల నివేదికను ఇప్పటికే ఐ ప్యాక్.. జగన్‌కు అందించిందనీ, ఆ నివేదికల ప్రకారం.. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం అవ్వడంలో  రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే.. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని సీఎం భావిస్తున్నారనీ, అందుకే ఆయన  దుట్టా రామచంద్రరావు  వైపే మొగ్గు చూపుతున్నారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

ఇక ఎన్నికలు జరగనున్న కొద్ది రోజుల ముందు.. నీవు గెలువవంటూ ఐ ప్యాక్ నివేదిక ఇచ్చింది ఏం చేద్దాం నీవే చెప్పు అంటూ వల్లభనేని వంశీని జగన్ పక్కన పెట్టేయడం ఖాయమంటున్నారు.  

అదీకాక.. గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్ర రావు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉన్నాయని.... అలాగే ఆయన అల్లుడు శివభరత్‌రెడ్డి.. సీఎం  జగన్ భార్య   భారతి సమీప బంధువన్న సంగతి అందరికీ తెలిసిందేనని... అయితే గత ఎన్నికల వేళ.. గన్నవరం టికెట్ కోసం శివభరత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని... కానీ నాడు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌ను ఆ పార్టీ అధినేత జగన్ ఎంపిక చేయడంతో.. ఈ సారి శివభరత్‌రెడ్డికి టికెట్ ఇస్తే.. వల్లభనేని వంశీని మోసం చేసినట్లు అందరికీ క్లియర్‌కట్‌గా అర్థమైపోతుందని..  అందుకే మద్యే మార్గంగా దుట్టా రామచంద్రరావుని గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. అంతేకాకుండా గెలిపించిన పార్టీపై రాళ్లు వేసి..  జగన్‌ని మనసా వాచా కర్మణా నమ్మి వెళ్లిన వల్లభనేని వంశీని  జగన్ నిలువునా ముంచేసేలా ఉన్నారని వంశీ అనుచరులు సైతం ఆందోళన చెందుతున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.