ప్రధాని ముఖం మీదే రాష్ట్ర నిధుల విడుదల డిమాండ్: తమిళనాడు సీఎంపై ప్రశంసల వర్షం.!

Publish Date:Oct 12, 2026

Advertisement

దేశ రాజకీయాల్లో చాలామంది నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమాలలో కేవలం ఆయనను ప్రశంసించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో చాలా మంది నేతలు మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయాన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 

ఈ వేదికపై ప్రసంగించిన ముఖ్యమంత్రి విజయ్, కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన  5 వేల ఒక వంద   కోట్ల  నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధాని మోదీని నేరుగా కోరారు. కోరారు అనడం కంటే డిమాండ్ చేశారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ నిధులు ఎంతో కీలకమని, ఎలాంటి ఆలస్యం లేకుండా వీటిని అందించాలని విజయ్ నొక్కి వక్కాణించారు.  

 నిధులతో పాటుగా తమిళనాడులోని పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కూడా సీఎం విజయ్ మాట్లాడారు.   చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు రాష్ట్రంలో కీలకమైన జాతీయ రహదారుల విస్తరణ,  నూతన రోడ్డు  ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. 

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో తన అభిప్రాయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేసిన సీఎం..  ఎంతటి పెద్ద వేదికైనా రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించారు. సామాన్యంగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభలలో స్థానిక నాయకులు పొగడ్తలకే పరిమితమవుతారని, అయితే విజయ్ మాత్రం రాష్ట్ర నిధుల సాధన కోసం ఈ వేదికను వేదికగా మలుచుకున్నారని రాజకీయవర్గాలలో విజయ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

[CM Vijay Demand Funds In Presense Of Narendra Modi, Tamil Nadu Politics, Developement Projects, Tamilnadu Developement,  Chennai Kanyakumari High Speed Train]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.