వల్లభనేని వంశి.. రెంటికి చెడ్డ రేవడేనా!

Publish Date:Aug 24, 2023

Advertisement

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించి..  ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ పార్టీ పంచన చేరిన వంశీ నాటి నుంచి గన్నవరంలో తెలుగుదేశం కోటను పగలగొట్టడమే పనిగా  పని చేశారు. తెలుగుదేశం  పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత విమర్శలు, అసభ్య దూషణలకు తెగబడి నియోజకవర్గంలోని తన సామాజిక వర్గానికే కాకుండా.. నియోజకవర్గ ప్రజలకు కూడా దూరమయ్యారు.

అయితే అధికార  పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయారు. పూర్తిగా వైసీపీని నమ్ముకుని వచ్చే  ఎన్నికలలో ఆ పార్టీ  అభ్యర్థిగా పోటీకి రెడీ అయిన వంశీ.. ఆ క్రమంలో తనకు అడ్డువస్తాడన్న భయంతో గత ఎన్నికలలో తనకు ప్రత్యర్థిగా నిలిచి పరాజయం పాలైన యార్లగడ్డకు చెక్ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా, వికటించాయా అన్న అనుమానాలు ఇప్పుడు ఆయనలోనే వ్యక్తం అవుతున్నాయి. యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. గన్నవరం నుంచే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా వంశీ, యార్లగడ్డల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వల్లభనేని వంశి పట్ల నియోజకవర్గంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించిన వైసీపీ అధిష్ఠానం పార్టీ టికెట్ పై ఆయనకు ఇచ్చిన హామీపై వెనక్కు తగ్గిన సంకేతాలను ఇస్తున్నది. అందుకు కారణంగా గన్నవరం పరిధిలోని నున్న  గ్రామంలో ఒక వార్డుకు జరిగగిన ఉప ఎన్నికలో వంశీ నిలబెట్టిన అభ్యర్థి పరాజయాన్ని చూపుతోంది.

 నున్నవల్లభనేని వంశీ కొద్ది రోజులుగా ఏమీ మాట్లాడటం లేదు. హైకమాండ్ నుంచి సందేశం వస్తే చాలు బూతులతో విరుచుకుపడేందుకు ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. లోకేష్ గన్నవరం పర్యటనకు వస్తున్నారని.. బహిరంగసభ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లారు… పారిపోయారని అంటారని చెప్పి మళ్లీ .. సభ రోజు గన్నవరం వచ్చారు కానీ మీడియాతో మాట్లాడలేదు. లోకేష్ పై ఎలాంటి ఆరోపణలు చేలేదు. నోరు చేసుకోలేదు. ఎందుకా అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. నున్న గ్రామం వైసీపీకి చాలా బలమైన స్థావరం.. అక్కడ రెడ్డి సామాజికవర్గం సంఖ్య ఎక్కువ. అటువంటి చోట కూడా ఒక వార్డు ఉప ఎన్నికలో వైసీపీకి చావుదెబ్బ తగిలింది.

వంశీపై వ్యతిరేకతే అందుకు కారణమని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. నియోజవర్గ వ్యాప్తంగా వంశీ పట్ల ఇదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా పార్టీ నిర్వహించుకున్న సర్వేలో కూడా ఇదే తేలడంతో వంశీకి గన్నవరం టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యార్లగడ్డ పార్టీని వీడేందుకు వంశీ తీరే కారణమనీ, యార్లగడ్డకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఒకింత గౌరవం, మర్యాద వంశీ ఇచ్చి ఉంటే ఆయన తెలుగుదేశం వైపు వెళ్లే వారు కాదనీ జగన్ ఇప్పుడు భావిస్తున్నారని అంటున్నారు.  దీంతో వంశీకి వ్రతమూ చెడి, ఫలమూ దక్కక రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే సమయం సందర్భం లేకున్నా  విమర్శలతో, తిట్లతో విరుచుకుపడే వంశీ తన గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రభంజనంలా సాగుతున్న సమయంలో కూడా నోరు మెదరపకుండా మౌనంగా ఉండిపోయారనీ, అసలు లోకేష్ పాదయాత్రకు ముందు ఆయన గన్నవరం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారనీ, అయితే చివరి నిముషంలో మనసు మార్చుకుని గన్నవరం వచ్చారనీ, అయినా లోకేష్ తనపై చేసిన విమర్శలపై స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయించడానికి కారణం వైసీపీలో తనకు ఆదరణ తగ్గడమే కారణమని అంటున్నారు.  మొత్తం మీద వంశీకి నిన్న మొన్నటి దాకా గన్నవరం వైసీపీ టికెట్ పై ఉన్న ధీమా ఇప్పుడు పూర్తిగా పోయిందనీ, దీంతోనే మౌనం వినా మరో గత్యంతరంలేని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.