ఆముదాలవలస తమ్మినేని చేయి జారినట్లేనా? వైసీపీ ప్లాన్ ఏమిటి?

Publish Date:Aug 24, 2023

Advertisement

ఏపీలో ఎన్నికల కాక పెరిగింది. ముఖ్యంగా అధికార వైసీపీలో పార్టీ టికెట్ల లొల్లి ఆ పార్టీకి మొదటికే మోసం తెచ్చేదిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార వైసీపీ.. దానిని అధిగమించడానికి పేరుగొప్ప ఎమ్మెల్యే పదవి తప్ప.. ఇంకే ప్రాధాన్యతా లభించక ఇంత కాలం లోలోపలే ఆవేదనతో మగ్గిపోయిన ఎమ్మెల్యేలపైనే వేటు వేయాలని భావిస్తున్నది. ఆ విషయంలో వైసీపీ ఎటువంటి తారతమ్యాలకూ చోటివ్వడం లేదు. మంత్రులు కూడా పార్టీ టికెట్ విషయంలో గ్యారంటీ లభించక ఏం జరుగుతుందో? ఏం జరిగితే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మధనపడుతున్నారు. అలా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కదు అన్న వారి జాబితాలో దాదాపు మొదటి పేరుగా స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు గట్టిగా  వినిపిస్తోంది.  

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో మరో సారి వైసీపీ జెండా ఎగురవేయాలంటే.. ఆ స్థానంలో కొత్త ముఖాన్నీ పోటీలో నిలబెట్టడమొక్కటే మార్గమన్న నిశ్చితాభిప్రాయానికి పార్టీ అధినేత జగన్ వచ్చేశారని అంటున్నారు.  అందుకోసం సమర్ధులైన అభ్యర్థి కోసం గాలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అసెంబ్లీ  స్పీకర్  తమ్మినేని సీతారాం   ఈసారి సీటు దక్కడం దాదాపు అసాధ్యం  అంటున్నారు. ఆయన పట్ల నియోజకవర్గ ప్రజలలోనే కాదు,  వైసీపీ క్యాడర్ లో కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమౌతోందంటున్నారు.  ఈ నేపధ్యంలో కొత్త ముఖాన్ని బరిలోకి దించితే తప్ప ఆముదాలవలస నియోజకవర్గంలో  కనీస పోటీ అయినా ఇచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి.

దీంతో ఆ స్థానంలో వైసీపీ జెండా మరోసారి ఎగరేయాలంటే అందుకు సమర్ధుడైన, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడమొక్కటే మార్గమని జగన్ నిర్ణయానికి వచ్చేశారనని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  దీంతో ఆయన  చూపు బోడేపల్లి వారసులపై పడిందని అంటున్నారు. జిల్లా   రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను  ప్రభుత్వం ఇటీవల అధికారికంగా నిర్వహించడం వెనుక ఆయన వారసులను పార్టీలోకి ఆహ్వానించి ఆముదాల వలస నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బొడ్డేపల్లి రాజగోపాల్ కోడలు బొడ్డేపల్లి సత్యవతిని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. బోడేపల్లి వారసురాలిగా సత్యవతి 2004, 2009 ఎన్నికలలో  ఆముదాల వలస నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.  విభజన అనంతరం 2014, 2019లలో అదే  స్థానం నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు.

వరుసగా రెండు పరాజయాల తరువాత కూడా బోడేపల్లి సత్యవతి  కాంగ్రెస్ ని వీడకుండా ఆ పార్టీకి ఆముదాలవలసలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్  బాధ్యతలను చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమె ఆముదాలవలస నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆమెను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి తీఎసుకుని రావడం ద్వారా 2024 ఎన్నికలలో లబ్ధి పొందాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే బోడేపల్లి రాజగోపాల్  శతజయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే వైసీపీ  బొడ్డేపల్లి సత్యవతితో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.  ఇక పోతే బోడేపల్లి సత్యవతి వైసీపీ గూటికి చేరడం అంటూ జరిగితే.. తమ్మినేని తిరుగుబాటు చేయడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే తమ్మినేని ఇప్పటికే  ఆముదాలవలస టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో వైసీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.