Publish Date:Jul 23, 2026
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇటీవల కొంత కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్న వల్లభనేని వంశీ ఈ లేఖ ద్వారా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు. ఆయన రాసిన లేఖలో పోలవరం కుడి కాల్వ ద్వారా పట్టిసీమ నీటిని గన్నవరం మెట్ట భూములకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ మోటార్ల నిలిపివేత చర్యలను తక్షణమే సమీక్షించి ఉపసంహరించుకోవాలని కోరారు.
అయితే విశేషం ఏమిటంటే.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ లేఖలో గతంలో తాను గన్నవరం ఎమ్మెల్యేగా కాలంలో అధికారుల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు చొరవతోనే నిరాటంకంగా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించగలిగామని పేర్కొన్నారు.
అంతే కాదు.. వైసీపీ వట్టి సీమ అంటూ విమర్శలు గుప్పించిన పట్టిసీమను ఆయన అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. గన్నవరం ప్రాంత రైతాంగానికి పట్టిసీమ ద్వారా అందుతున్న ప్రయోజనాలను వివరించారు. 2015లో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను గన్నవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ.. పోలవరం కుడి కాల్వ పక్కనే ఉన్న మెట్ట ప్రాంత గ్రామాల రైతులకు కూడా పట్టిసీమ నీటిని వినియోగించుకునే సదవకాశాన్ని అప్పటి చంద్రబాబు సర్కార్ కల్పించిందని ప్రశంసలు గుప్పించారు.
Vallabhaneni Vamshi letter to CBN, Praises, Pattiseema, Babu, Vision
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-letter-to-cbn-39-226878.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.