అమాయకుల రక్తాన్ని కళ్ళ జూసిన లాఠీలు.!

Publish Date:Jul 23, 2026

Advertisement

ఒక అమ్మాయి అడిగిన ఒక్క ప్రశ్న... మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...? అని
 ఆ ప్రశ్నకు... ఎవరూ సమాధానం చెప్పలేదు. 
నమస్తే...చరిత్రలో...కొన్ని రోజులు...క్యాలెండర్‌లో ఒక తేదీగా మాత్రమే మిగిలిపోతాయి.కానీ...కొన్ని రోజులు మాత్రం...ఒక దేశం...తన భవిష్యత్తును...తన చేతులతో రాయడం మొదలుపెట్టిన రోజులుగా నిలిచిపోతాయి. ఇప్పుడు...నేను మీకు చెప్పబోయేది...రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి. 
 ...ఢిల్లీ వీధుల్లో...వేలాది మంది యువత నడిచారు. వాళ్ల చేతుల్లో...తుపాకులు లేవు.కత్తులు లేవు.రాళ్లు కూడా లేవు.ఉన్నదల్లా...కొన్ని ప్లకార్డులు...కొన్ని ప్రశ్నలు...ఆపై ... భవిష్యత్తుపై భయం.

ఆ వీడియోలు...నేను చాలాసార్లు చూశాను. ప్రతిసారి...ఒకే ప్రశ్న...నా మనసులో వినిపించింది. ఒకవేళ...ఆ పోలీసుల ముందు నిలబడి... మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...?' అని అడుగుతున్నది...నా కూతురే అయితే...?  ఆ ఒక్క ఆలోచనే...గుండెను భారంగా మార్చేసింది.
జంతర్ మంతర్...గత కొన్ని వారాలుగా...ఒక నిరసన వేదికగా మారింది. మొదట...నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి...బాధ్యత వహిస్తూ...కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కొంతమంది విద్యార్థులు...నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచాయి.ఆ నిరసన...కొద్దిమంది నుంచి...వందల మందికి...వందల మంది నుంచి...వేల మందికి చేరింది.  అలా     సోమవారం...పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున..ఆ యువత... చలో సంసద్ అని పిలుపునిచ్చింది. ప్రభుత్వం...ముందుగానే సిద్ధమైంది.నగరాన్ని...నాలుగైదు భద్రతా జోన్లుగా విభజించింది.రాపిడ్ యాక్షన్ ఫోర్స్...సీఆర్పీఎఫ్...ఢిల్లీ పోలీసులు...ఇంకా భారీ బలగాలను మోహరించింది.మెట్రో స్టేషన్లు మూసివేసింది.కొన్ని ప్రాంతాల్లో...ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అన్ని ఏర్పాట్లు...చేసి...ఆ యువత...పార్లమెంట్ గేటు దగ్గరకు చేరకుండా ఆపాలనుకుంది. కానీ...జరిగింది మాత్రం...వేరే. వేలాది మంది యువత...అన్ని అడ్డంకులను దాటుకుంటూ...ముందుకు దూసుకొచ్చారు. పోలీసులు...లాఠీలు ఎత్తారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.అయినా...వాళ్లు వెనక్కి తగ్గలేదు.
ఒక్కసారి...ఆ వీడియోలను...చుడండి.ఒక అమ్మాయి...పోలీసుల ముందు నిలబడి...భయంతో కాదు...ఆవేదనతో...ఒక్క ప్రశ్న అడుగుతోంది.
"ఆప్ హమే క్యూ మార్ రహే హై...?"
"మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...?"
ఆమె గొంతులో...కోపం లేదు.ద్వేషం లేదు.ఉన్నదల్లా...ఒక సమాధానం కోసం ఎదురుచూస్తున్న...అసహాయత.
మరో వీడియోలో...ఒక మహిళా కార్యకర్త...పోలీసుల వైపు తిరిగి...గట్టిగా ప్రశ్నిస్తోంది.
"ఆప్ లడ్కియోంకే కప్డే క్యూ ఫాడ్ రహే హై...?"
"అమ్మాయిల బట్టలు ఎందుకు చింపేస్తున్నారు...?"
ఆ ప్రశ్న...ఒక పోలీసును కాదు.ఒక వ్యవస్థను నిలదీస్తోంది.
   ఆ రోజు...ఢిల్లీ వీధుల్లో...కేవలం ఒక నిరసన జరగలేదు.ఒక ప్రశ్న...దేశమంతా వినిపించింది.ఆ ప్రశ్న...ప్రభుత్వాన్ని మాత్రమే కాదు...అందరినీ ఆలోచింపజేసింది.
"ఈ యువత...కేవలం ఒక పరీక్ష కోసం పోరాడుతోందా...?లేక...తన భవిష్యత్తు కోసం పోరాడుతోందా...?"
ఇంకో వీడియో...ఇంకా బాధాకరం.చుట్టూ...డజన్ల కొద్దీ పోలీసులు.మధ్యలో...ఒక్కడే యువకుడు.లాఠీలు...వర్షంలా కురుస్తున్నాయి.కానీ...అతను...వెనక్కి తగ్గలేదు.పైగా...పోలీసుల కళ్లలోకి...నేరుగా చూస్తూ...ఒకే మాట అంటున్నాడు.
"మారో...ముఝే ఔర్ మారో...""ఇంకా కొట్టండి..."
ఆ మాటలో...నొప్పి ఉంది.కానీ...భయం మాత్రం లేదు.
ఇలా ఎంతో మంది యువతీ యువకులు గాయాల  పాలై రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి లో చేరారు... ఆ రోజు...అది ఒక ఆసుపత్రి మాత్రమే కాదు. ఆ నిరసన...ఎంత తీవ్రంగా అణచివేయబడిందో...చెప్పిన...మౌన సాక్షిగా నిలిచింది. ఈ యువత...కేవలం...నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించే...రోడ్డు మీదికి వచ్చిందా...?" లేదు..."ఈ యువతను...కేవలం...ఒక పరీక్ష...రోడ్డు మీదికి తీసుకురాలేదు.
ఏళ్లుగా...వారి మనసుల్లో పేరుకుపోయిన...నిరాశ...నిరుద్యోగం...చాలీచాలని జీతాలు...వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం...ఇవన్నీ...ఒకేసారి...పేలిపోయాయి. 
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .జంతర్ మంతర్‌కు వచ్చిన...చాలామంది యువతను...ఏ రాజకీయ పార్టీ...బస్సులు పెట్టి తీసుకురాలేదు. ఎవరూ...డబ్బులు ఇచ్చి పిలవలేదు.ఎవరూ...రైళ్లు ఏర్పాటు చేయలేదు.
మరి ఎలా జరిగింది..? సోషల్ మీడియాలో...ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ...ఒక పిలుపుగా మారింది.ఆ పిలుపు...వేల అడుగులుగా మారింది. దాని పేరే క్రాకోచ్..   

కాక్రోచ్ దండు... ఒక్క బొద్దింకను...ఎవరైనా...సులభంగా తొక్కేయొచ్చు. కానీ...వేల బొద్దింకలు...ఒకేసారి...కదలడం మొదలుపెడితే...వాటిని...అంత సులభంగా...ఆపలేరు. ఈ ఉద్యమం కూడా...అలాంటిదే.
ఇది...ఒక పార్టీ ఉద్యమం కంటే...ఒక తరం...తన భవిష్యత్తు గురించి...అడుగుతున్న ప్రశ్నగా...మారింది. కానీ...ఈ యువతను...ప్రభుత్వం...సరైన సమయంలో...అర్థం చేసుకుందా...? లేక... శాంతిభద్రతల సమస్యగా మాత్రమే...చూసిందా...?

చాలామంది అనుకుంటున్నారు...ఇది...ఒక రాజకీయ పార్టీ ఉద్యమమని.కానీ...నేను చూసింది మాత్రం...అది కాదు.నాకు కనిపించింది...దిక్కుతోచని...ఒక తరం. జంతర్ మంతర్‌కు వచ్చిన...ఆ యువతను...ఒక్కసారి గమనించండి. దేశం నలుమూలల నుంచి...వేల మంది యువత...ఢిల్లీకి ఎలా వచ్చారు...? ఒకప్పుడు...మనుషులను..రోడ్ల మీదకు తీసుకొచ్చేది...రాజకీయ పార్టీలు.ఇప్పుడు...ఒక మొబైల్ ఫోన్...ఒక వీడియో...ఒక పోస్ట్...ఒక రీల్...చాలు.అదే...వేల అడుగులను...ఒకే దారిలో నడిపిస్తోంది.
ఈ యువత...కేవలం...నీట్ ప్రశ్నపత్రం కోసం...రోడ్డు మీదకు వచ్చిందా...?
నాకు మాత్రం...అలా అనిపించడం లేదు.
ఇది...ఏళ్లుగా...వారి మనసుల్లో...నిశ్శబ్దంగా పేరుకుపోతున్న...నిరాశ.
ఉద్యోగాల కోసం...ఎదురుచూస్తూ...అలసిపోయిన కళ్ల బాధ.
చదివినా...భవిష్యత్తు కనిపించక...ఆగిపోయిన అడుగుల బాధ.
చాలీచాలని జీతాలతో...కలలను...రోజూ కొంచెం కొంచెంగా...చంపుకుంటున్న...ఒక తరం బాధ.
ఇవన్నీ...ఒకేసారి...బయటకు వచ్చాయి.
ఈ తరం...గతాన్ని చూసి...రోడ్డెక్కలేదు.ఎమర్జెన్సీని... చూడలేదు.జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం...వాళ్లకు జ్ఞాపకం లేదు.మండల్...కమండల్...వాళ్ల రాజకీయ అనుభవంలో భాగం కాదు. వాళ్లు...చరిత్ర పుస్తకాలు చదివి...ప్రశ్నించడం లేదు.తమ జీవితాన్ని చూసి...ప్రశ్నిస్తున్నారు.
అందుకే...ఈ తరాన్ని...తప్పు అని చెప్పలేం. రైట్ అని కూడా చెప్పలేం. వాళ్లు...ఒక సిద్ధాంతాన్ని కాదు...ఒక సమాధానాన్ని వెతుకుతున్నారు.వాళ్ల చేతుల్లో...జెండాల కంటే...మొబైల్ ఫోన్లు ఎక్కువ. వాళ్ల నోట...నినాదాల కంటే...ప్రశ్నలే ఎక్కువ. 

ఒకప్పుడు...టెలివిజన్...ఏది చూపిస్తే...దేశం అదే చూసేది. ఇప్పుడు...దేశం...తన ఫోన్‌లో...తానే చూసేది నమ్ముతోంది. ఒక వీడియో...లక్షల మందికి చేరుతోంది. ఒక ప్రశ్న...కోట్ల మందిలో...ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు...వార్తలు...ప్రజల దగ్గరకు వెళ్లడం లేదు.ప్రజలే...వార్తలుగా మారుతున్నారు.
అలా...ఈ ఉద్యమం...ముందు...సోషల్ మీడియాలో పుట్టింది. తర్వాత...జంతర్ మంతర్‌కు చేరింది.చివరికి...పార్లమెంట్ గేటు వరకు...నడిచింది. ఈ ఉద్యమం...ఒక పార్టీ చేస్తున్న ఉద్యమంలా  కనిపించలేదు.సమాధానం కోసం...దేశాన్ని నిలదీస్తున్న...ఒక తరం లా కనిపించింది....అదే...ఇక్కడ...అత్యంత ప్రమాదకరమైన విషయం కూడా. ఎందుకంటే...

ప్రశ్నలు అడగడం మొదలుపెట్టిన తరం...సమాధానం దొరికే వరకు...ఆగదు.
కానీ...ప్రశ్న...ఇంకా మిగిలే ఉంది.ఈ యువత...రోడ్డు మీదికి వచ్చింది.ఆ తర్వాత...ఏమైంది...?

మొదట...వాళ్లది...ఒక సాధారణ నిరసనగా చూశారు. తర్వాత...ఒక శాంతిభద్రతల సమస్యగా చూశారు.ఆ తర్వాత...లాఠీలతో...చెదరగొట్టాలని ప్రయత్నించారు.కానీ...ఒక విషయం...ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
ఒక మనిషిని...ఆపొచ్చు.వంద మందిని...భయపెట్టొచ్చు.కానీ...ఒక తరం...ప్రశ్నించడం మొదలుపెడితే...దాన్ని...లాఠీలతో ఆపలేం. బహుశా...అందుకేనేమో...ఇది...ముందు జరిగిన ఉద్యమాల్లా కాదు.వాళ్లు...ఎవరో చెప్పారని...నమ్మరు. చూసినదాన్ని...విన్నదాన్ని...తమంతట తామే...ప్రశ్నిస్తారు.సమాధానం...సంతృప్తికరంగా అనిపించకపోతే...మళ్లీ ప్రశ్నిస్తారు.

ప్రతిపక్షాలు...తమ బాధ్యతను...ఎంతవరకు నిర్వర్తించాయి...? ప్రభుత్వం...ప్రజల ఆందోళనలను...ఎంతవరకు వినగలిగింది...?ఈ ప్రశ్నలకు...కాలమే సమాధానం చెబుతుంది.కానీ...ఒక విషయం మాత్రం...ఈ రోజు స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డు మీద నిలబడ్డ...ఆ యువత...కేవలం...ఈ రోజు గురించి మాట్లాడటం లేదు.రేపటి గురించి...మాట్లాడుతోంది. 

 ప్రజాస్వామ్యంలో...ప్రశ్న అడగడం...నేరం కాదు. ప్రశ్నను వినకుండా ఉండిపోవడమే...ప్రమాదం. అందుకే వాళ్ళు నిరసనను తీవ్రతరం చేసారు.  చరిత్ర...మనకు...ఒక విషయం నేర్పింది. మార్పు...ఎప్పుడూ...గొప్ప నాయకులతోనే...ప్రారంభం కాదు.కొన్నిసార్లు...ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది.
ఆ ప్రశ్న...ఒక గొంతు నుంచి...వంద గొంతులకు...వేల గొంతులకు...చివరికి...ఒక దేశం గొంతుగా మారుతుంది. బహుశా...ఈరోజు...మనమూ...అలాంటి ఒక క్షణాన్నే...చూస్తున్నామేమో. నేను...మీరు...మనందరం...చరిత్రలో మరో పేజీ తిరుగుతున్న శబ్దాన్ని...వింటున్నామేమో. 
చివరికీ ప్రతి ఉద్యమం...ఒకే కారణంతో పుట్టకపోవచ్చు. కానీ...ప్రతి ఉద్యమం వెనుక...ఒక అసంతృప్తి మాత్రం ఉంటుంది. యువత అసంతృప్తిని అర్థం చేసుకొని ప్రభుత్వం దానిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం... 

 

 

Batons witnessed blood of  innocent, Jantarmantar, Agitation, Youth, Question, Nation, Future

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.