Publish Date:Sep 25, 2025
వైసీసీ అధికారంలో ఉన్నంత కాలం.. అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మాటల దాడి చేసిన వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మౌనం వహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం టికెట్ పై ఎన్నికలలో విజయం సాధించి.. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలు కావడంతో జగన్ పార్టీ గూటికి చేరిన వల్లభనేని వంశీ.. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం సహా.. తెలుగుదేశం కార్యకర్తలపై దౌర్జన్యాలకు తెగబడ్డారు.
అయితే చేసిన పాపం ఊరికే పోదన్నట్లుగా అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిన వంశీ పరిస్థితి ఆ తరువాత దయనీయంగా మారింది. 2024 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడమే కాకుండా వంశీ స్వయంగా గన్నవరంలో ఓడిపోయారు. గతంలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దాడులతో కేసులలో ఇరుక్కుని జైలు పాలయ్యారు. విజయవాడ జిల్లా జైలులో నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తరువాత బెయిలుపై విడుదలైనా క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా భావించారు. అయితే హఠాత్తుగా వంశీ బుధవారం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులతో భేటీ అయ్యారు. అది కూడా అతి తక్కువ సమయం మాత్రమే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లుగా ఆయన భేటీ సాగింది. మొత్తం మీద వంశీ నియోజకవర్గంలో కొందరు వైసీపీయులను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి జగన్ వంశీని పీకేస్తారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆయన బయటకు రావడంతో మళ్లీ పోలిటికల్ గా వంశీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే నియోజకవర్గ పార్టీ నేతలు మాత్రం వంశీకి మద్దతుగా నిలిచే ప్రశక్తే లేదని అంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. చూడాలి మరి వంశీ ముందు ముందు ఏ నిర్ణయం తీసుకుంటారో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-brief-meet-with-ycp-supporters-in-gannavaram-39-206880.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.