ఉత్తరాఖండ్ లో విషాదం.. కొండచరియలు విరిగి పడి ఏడుగురు దుర్మరణం.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఉత్తరాఘండ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న  జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో కొండచరియలు  విరిగిపడి ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.  పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  మరో ఆరుగురు గల్లంతయ్యారు. 

 గురువారం (ఆగస్టు 13) రాత్రి ఏడుగంటల సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.  తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్   నిర్మిస్తున్న  విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో   కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో  టన్నెల్ పైభాగం నుంచి భారీ కొండచరియలు  విరిగిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే కొండచరియలతో పాటు కొండపై నుంచి భారీగా బురద, నీరు  టన్నెల్ లోపలికి వేగంగా దూసుకొచ్చాయి. ఘటన జరిగిన సమయంలో టన్నెల్ లో 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నీరు, బురద వేగంగా రావడం, మార్గం మూసుకుపోవడంతో కార్మికులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు.

 సమాచారం అందుకోగానే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  ), ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ బలగాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.  ఏడుగురు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. అలాగే తీవ్రంగా గాయపడిన తొమ్మండుగురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. టన్నెల్ లోపలే మరో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని కంట్రోల్ రూమ్ నుండి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.  బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని  హామీ ఇచ్చారు. 

Uttarakhand Tunnel Accident, Chamoli Landslide, Vishnugad Pipalkoti Hydroelectric Project, Tunnel Collapse, NDRF Rescue Operation, TeluguOne

By
en-us Political News

  
ది న్యూయార్క్ టైమ్స్ అమరావతి నిర్మాణం, పురోగతి, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతా ద్వారా షేర్ చేశారు.
సర్ కారణంగా తన ఒక్కడి ఓటే కాదు.. బెంగళూరు వ్యాప్తంగా  65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని ఆధారాలతో సహా ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయ
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.