కిమ్స్ ఆస్పత్రి నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్..!

Publish Date:Aug 13, 2026

Advertisement

 

సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!

ప్రముఖ సినీ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. వైద్యులు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతం గా పూర్తయిందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌ను ఆస్పత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. 

ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారక్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, శస్త్రచికిత్స విజయవంతం గా పూర్తయిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తు న్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో అభిమానుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో తన  శస్త్రచికిత్సపై స్వయంగా తారక్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎన్టీఆర్.  ‘మీ అందరి నుంచి వెల్లువెత్తిన ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. నా కోసం మీరు ప్రార్థనలు చేసినందుకు చాలా కృతజ్ఞుడిని. సర్జరీ విజయవంతమైంది. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. స్నేహితులు, కుటుంబం, అభిమానులు మద్దతు నాకు ప్రతిరోజు బలాన్ని ఇస్తుంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. 

Jr NTR discharged from KIMS Hospital, Jr NTR,  KIMS Hospital, Secunderabad, Health Bulletin
 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.