ఇరాన్‌పై ఆగని అమెరికా దాడులు.!

Publish Date:Jul 10, 2026

Advertisement

అమెరికా ఇరాన్ పై భీకర దాడులను కొనసాగిస్తున్నది. వరుసగా మూడో రోజు అమెరికా ఇరాన్ పై దాడులను కొనసాగించింది. మూడో రోజు  గురువారం (జులై 9) అమెరికా ఇరాన్ లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది.   ఈ దాడుల తీవ్రతకు దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక తీర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా  ఇరాన్‌కు చెందిన అత్యంత వ్యూహాత్మక బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు పేలడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 

బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ   దాడుల ప్రభావంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా  జరిపిన ఈ దాడుల ధాటికి బుషెహర్ అణు కేంద్రం ప్రాంగణంలోని ఒక ముఖ్యమైన భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. కేవలం అణు కేంద్రమే కాకుండా, ఇరాన్ రక్షణ రంగానికి, వాణిజ్యానికి అత్యంత కీలకమైన బందర్ అబ్బాస్, కొనారక్ వంటి తీరప్రాంత నగరాలపై కూడా అమెరికా దాడులు చేసింది.  ప్రధానంగా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

గత 48 గంటల వ్యవధిలోనే అమెరికా మిలిటరీ ఇరాన్ సరిహద్దుల్లో భీకర దాడులతో విధ్వంసం సృష్టించింది. ఇరాన్ తీర ప్రాంతాల పొడవునా విస్తరించి ఉన్న దాదాపు 170 కి పైగా సైనిక స్థావరాలు, నిఘా కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్‌లపై అమెరికా వైమానిక దళం   విరుచుకుపడింది. ఈ దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో  భయానక వాతావరణం నెలకొంది.  

Bushehr nuclear power plant, Strait of Hormuz conflict, Donald Trump Iran, US Iran war crisis, Persian Gulf explosions

By
en-us Political News

  
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఉదంతం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాటి తొక్కిసలాట సంఘటన తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని విషాద ఘటనగా అభివర్ణించారు. నాటి సంఘటనను తలచుకుంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తనను నమ్మి ఆ సభకు వచ్చిన వారిని కాపాడుకోలేకపోయానన్నారు. తనను నమ్మినందుకే వారు బలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరలేచింది.
Corona scare in Kadapa, Andhra Pradesh Covid Cases, Kadapa Covid Deaths, New Corona Variant AP, Omicron Subvariant Symptoms
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.