ఇరాన్‌పై ఆగని అమెరికా దాడులు.!
Publish Date:Jul 10, 2026
Advertisement
అమెరికా ఇరాన్ పై భీకర దాడులను కొనసాగిస్తున్నది. వరుసగా మూడో రోజు అమెరికా ఇరాన్ పై దాడులను కొనసాగించింది. మూడో రోజు గురువారం (జులై 9) అమెరికా ఇరాన్ లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల తీవ్రతకు దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక తీర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన అత్యంత వ్యూహాత్మక బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు పేలడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల ప్రభావంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా జరిపిన ఈ దాడుల ధాటికి బుషెహర్ అణు కేంద్రం ప్రాంగణంలోని ఒక ముఖ్యమైన భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. కేవలం అణు కేంద్రమే కాకుండా, ఇరాన్ రక్షణ రంగానికి, వాణిజ్యానికి అత్యంత కీలకమైన బందర్ అబ్బాస్, కొనారక్ వంటి తీరప్రాంత నగరాలపై కూడా అమెరికా దాడులు చేసింది. ప్రధానంగా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. గత 48 గంటల వ్యవధిలోనే అమెరికా మిలిటరీ ఇరాన్ సరిహద్దుల్లో భీకర దాడులతో విధ్వంసం సృష్టించింది. ఇరాన్ తీర ప్రాంతాల పొడవునా విస్తరించి ఉన్న దాదాపు 170 కి పైగా సైనిక స్థావరాలు, నిఘా కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్‌లపై అమెరికా వైమానిక దళం విరుచుకుపడింది. ఈ దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. Bushehr nuclear power plant, Strait of Hormuz conflict, Donald Trump Iran, US Iran war crisis, Persian Gulf explosions
http://www.teluguone.com/news/content/us-attacks-on-iran-continue-36-225571.html





