కడపలో కరోనా కలకలం.!?

Publish Date:Jul 10, 2026

Advertisement

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందా?  రాష్ట్రంలో కరోనా విజృంభణ మొదలైందా? అంటే కడప జిల్లాలో కరోనా కారణంగా ఇద్దరు మరణించారన్న వార్తలు ఔననే చెబుతున్నాయి.  నాలుగేళ్ల విరామం తరువాత ఒక్కసారిగా ఏపీలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. కడప జిల్లాలో ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. మరో నలుగురు కరోనా పాజిటివ్ గా తేలారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
రాష్ట్రంలో 2022 తర్వాత మళ్లీ కోవిడ్ మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడంతో యంత్రాంగం   అప్రమత్తమైంది. 
వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మరణించిన వారిలో మొదటి వ్యక్తి 60 ఏళ్ల  ఎన్. సుబ్బరాయుడు.  మధుమేహం, కిడ్నీవ్యాధి, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు. మొదట తిరుపతిలోని స్విమ్స్   ఆసుపత్రిలో చేరిన ఈయనను, పరిస్థితి విషమించడంతో వేలూరులోని సిఎంసి  ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 28న  కన్నుమూశారు. ఆయన మరణానంతరం నిర్వహించిన ఆర్‌టి-పిసిఆర్  పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత వల్లే ఆయన పరిస్థితి వేగంగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు.

ఇక రెండో కేసులో కడప నగరంలోని మాసాపేట ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల సయ్యద్ మబాషా  కోవిడ్ బారిన పడి మరణించారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, నిరంతరాయంగా వచ్చే దగ్గుతో ఆయన ఈ నెల 4న కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు ఎక్స్-రే నిర్వహించగా, రెండు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని తీవ్రమైన న్యుమోనియాకు దారితీసినట్లు గుర్తించారు. ఆయనకు దీర్ఘకాలికంగా మద్యపానం అలవాటు ఉండటం వల్ల శ్వాసకోశ వ్యవస్థ మరింత బలహీనపడిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి నాలుగు రోజుల పాటు హై-డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో, అనుమానం వచ్చి చెస్ట్ సిటి స్కాన్ చేయగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. జులై 7న ఆయన  మరణించారు.

ఈ రెండు మరణాలతో పాటు, జిల్లాలో మరో నలుగురు వ్యక్తులు ఆర్‌టి పిసిఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వీరిలో ముగ్గురు బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, స్వల్ప లక్షణాలు ఉన్న నాల్గవ రోగిని కడపలోని ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాజిటివ్‌గా తేలిన ఈ నలుగురు రోగులు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.  అలాగే వీరిలో ఒకరు బూస్టర్ డోస్ కూడా పొందారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారిలో కూడా ఈ స్థాయిలో ఇన్ఫెక్షన్ కనిపించడం ఇప్పుడు వైద్యులను ఆలోచనలో పడేసింది. బాధితులు వ్యక్తపరుస్తున్న లక్షణాలను బట్టి, ఇది ఒమిక్రాన్ (  కొత్త సబ్-వేరియంట్ కావచ్చునని అధికారులు   అనుమానిస్తున్నారు.

 పరిస్థితి తీవ్రతను గమనించిన కడప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,  ఉన్నతాధికారులు తక్షణ నివారణ చర్యలు చేపట్టారు. మరణించిన, పాజిటివ్‌గా తేలిన రోగుల నమూనాలను వైరస్  ఖచ్చితమైన వేరియంట్‌ను గుర్తించడం కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.  

Andhra Pradesh Covid Cases, Kadapa Covid Deaths, New Corona Variant AP, Omicron Subvariant Symptoms

By
en-us Political News

  
ఈ దారుణ నరమేధంలో నిందితుడు కేవలం ఫిర్యాదుదారులనే కాకుండా, తన స్వంత భార్యను, పిల్లలను కూడా వదలకుండా ప్రాణాలు తీయడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులను కూడా నిందితుడు దారుణంగా హత్య చేశాడు.
బహామాస్ రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి పది మంది ప్రయాణీకులతో బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విద్యా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు లభించాయని వెల్లడించారు.
చర్చల కోసం ఇరాన్ తమను అభ్యర్థించిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. తాము అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రతినిధుల పర్యటనను మాత్రమే అంగీకరించామని కుండబద్దలు కొట్టింది.
తెహతా - జెహానాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఉంతా-మదర్‌పూర్ ప్రాంతంలో దొంగలు.. డౌన్ లైన్‌లో ఉన్న ప్రమాదకరమైన ఓవర్ హెడ్ హైవోల్టేజ్ వైర్లను కట్ చేసి కరెంట్ సప్లై నిలిపేశారు. ఆ తరువాత వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు.
ఇజ్రాయెల్ నుంచి తమకు నేరుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.