అమెరికా, ఇరాన్.. మళ్లీ శాంతి చర్చలు.. ఈ సారైనా ఫలిస్తాయా?

Publish Date:Apr 14, 2026

Advertisement

 ఉప్పు నిప్పులా ఉండే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు చిగురంత ఆశను రేకెత్తిస్తున్నాయి. దశాబ్దాల సంక్షోభానికీ, శత్రుత్వానికీ ఎండ్ కార్డ్ వేసే దిశగా ఈ చర్చలు సాగాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. పాకిస్థాన్ వేదికగా గడిచిన ఆదివారం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిసి, చర్చలు విఫలం అంటే అమెరికా ఏకపక్షంగా ప్రకటన చేసిన తరువాత శాంతి ఆశలు దాదాపు అణగారిపోయాయి. ఈ నేపథ్యంలో మరో సారి చర్చలు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఈ సారైనా చర్ఛలు ఫలవంతంగా సాగాలని కోరుకుంటున్నాయి.

 దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించే దిశగా ఇరు దేశాలూ అంటే అమెరికా, ఇరాన్ లు అడుగులు వేస్తున్నాయి.  పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది.  

శాంతి చర్చలకు ప్రతిష్ఠంభనగా మారిన  2015 నాటి అణు ఒప్పందం విషయంలో  పట్టువిడుపుల ధోరణి అవలంబించేదుకు ఇరు దేశాలూ కూడా ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.  డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఈ ఒప్పందం నుండి వైదొలగిన తర్వాత, ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇక తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై సంయుక్తదాడులకు పాల్పడటంతో ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముగింటకు చేరిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్యా ఆదివారం ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఒక కీలక ముందడుగుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ చర్చలు విఫలమై.. మళ్లీ దట్టంగా యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ.. అమెరికా, ఇరాక్ లు మరో మారు శాంతి చర్చలు నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేశాయన్న వార్తలు ప్రపంచ శాంతి కోరుకునే వ్యక్తలలో హర్షాతిరేకాలను నింపాయి. సమస్యల పరిష్కారానికి దౌత్యమే ఏకైక మార్గమని, అయితే అది తమ జాతీయ భద్రతా ప్రయోజనాలకు లోబడి ఉండాలని చెబుతున్న అమెరికా..  ఇరాన్ తో శాంతి చర్చల కోసం ఒకటి కాదు, పది మెట్టైనా దిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

గత శని, ఆదివారాల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా  సోమవారం నుండి ఇరాన్ ఓడరేవులకు వచ్చే ఓడలపై పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా, ఇరాన్ మధ్య గురువారం (ఏప్రిల్ 16) మరో సారి చర్చలు జరగనున్నాయి. ఒకవైపు సైనిక చర్యలు, మరోవైపు దౌత్య చర్చలు సాగించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నది అమెరికా వ్యూహంగా చెబుతున్నారు.   పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాదే ఈ సారి కూడా ఈ కీలక చర్చలకు  వేదిక కానుంది.

గతంలో జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి స్పష్టమైన ఒప్పందం లేకుండా ముగియడం, ఆ వెంటనే అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ప్రకటించడం వంటి ఉద్రిక్త పరిణామాల మధ్య  ఇప్పుడు జరగనున్న రెండో విడత చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇక   గురువారం (ఏప్రిల్ 15) జరగబోయే చర్చల్లో ఏ స్థాయి ప్రతినిధులు పాల్గొంటారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.   ఏది ఏమైనా  అమెరికా, ఇరాన్  పంతాలను వీడి శాంతి దిశగా అడుగులు వేయాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.

By
en-us Political News

  
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం.. ఇప్పుడు లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డాలర్ భవిష్యత్తుపై చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బ్రెజిల్, చైనా వంటి దేశాలు తమ పరస్పర వాణిజ్యం కోసం డాలర్‌ను పక్కన పెట్టి, సొంత కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి గనుక మరో ఐదేళ్ల పాటు కొనసాగితే.. ప్రపంచ దేశాలకు అమెరికా డాలర్‌తో అవసరం తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.