Publish Date:Jun 17, 2026
హైదరాబాద్ లో ర్యాగింగ్ మరోసారి కలకలం రేపింది. . విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజానికి సేవ చేయాల్సిన కాబోయే వైద్యులే తోటి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ డెంటల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రమశిక్షణకు, ఉన్నత విలువులకు మారుపేరుగా నిలవాల్సిన వైద్య విద్యా సంస్థలో ర్యాగింగ్ పట్ల సర్వత్రా ఆందోళనకు దారితీస్తోంది.
ర్యాగింగ్ సంఘటనకు సంబంధించి ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు, ప్రస్తుతం మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్నారు. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు నివసిస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే ఈ ర్యాగింగ్ జరిగింది. హాస్టల్ గదుల్లో ఒంటరిగా దొరికిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో శారీరకంగా, మానసికంగా వేధించినట్లు చెబుతున్నారు.
ఫ్రెషర్స్ డే సన్నాహాల పేరుతో మొదలైన ఈ వేధింపులు.. ఆ తర్వాత శ్రుతిమించి హింసాత్మక రూపం దాల్చాయి. కాలేజీ హాస్టల్ పరిసరాల్లో రాత్రి సమయాల్లో జూనియర్లను నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. దీనిపై బాధితులు ఇచ్చిన సమాచారంతో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ సుల్తాన్ బజార్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సుల్తాన్ బజార్ పోలీసులు వేధింపులకు పాల్పడిన ఆ 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద నాన్-బైలబుల్ సెక్షన్లతో కేసులను నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కేసు నమోదు కాగానే కాలేజీ యాజమాన్యం కూడా అంతర్గత క్రమశిక్షణా చర్యలను ముమ్మరం చేసింది. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా, ఆ 12 మంది నిందితులలో చురుగ్గా వ్యవహరించిన ఆరుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ చేసింది. మిగిలిన ఆరుగురిపై కూడా పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సదరు సీనియర్ విద్యార్థుల విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/uproar-over-ragging-at-government-dental-college-36-223252.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.