కార్డు ఎందుకు దండగ.. ఏటీఎంలో యూపీఐ స్కాన్ ఉండగా!

Publish Date:Sep 9, 2023

Advertisement

ఏటీఎం.. ఇప్పుడంటే పేటీఎం, జీపే, ఫోన్ పే, భారత్ పే, వాట్సాప్ పే, భీమ్ పే ఇలా ఎన్నో రకాల యూపీఐ పేమెంట్ యాప్స్ వచ్చాయి కానీ.. అంతకు ముందు బ్యాంకు, లేదంటే ఏటీఎం మాత్రమే లావాదేవీలకు దిక్కు. బ్యాంకులో రద్దీని తట్టుకోలేక వీలైనంతవరకు అందరూ ఏటీఎంల మీదనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పటికీ చాలా మంది నగదు కావాలంటే ఏటీఎంలలో విత్ డ్రా  చేసుకుంటారు. అయితే  తరచుగా ఎక్కడో చోట పెట్టేసి కార్డులు మర్చిపోవడం, పోగొట్టుకోవడం, లేదా పిన్ నంబర్ మర్చిపోవడం పలువురికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్  అప్షన్స్ తీసుకొచ్చారు. అయితే  సదరు బ్యాంక్ యాప్ ఉంటేనే ఇది వీలవుతుంది. ముందుగా యాప్ లో ఎంత కావాలో అంతకు కార్డ్ లెస్ లో సెలక్ట్ చేసుకుంటే ఒక పాస్ వర్డ్ వస్తుంది. దాంతో ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.

అయితే ఈ కార్డ్ లెస్ విత్ డ్రాయల్ విధానంలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. యూపీఐ పేమెంట్ అప్షన్ ద్వారా కూడా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.  హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. యూపీఐ ఏటీఎంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీన్ని  హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం  అని పిలుస్తారు. దీనిని ఉపయోగించుకుని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో పని లేకుండానే  ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో ఈ హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను లాంచ్ చేశారు. త్వరలో ఈ ఏటీఎంలను  అందుబాటులోకి రానున్నాయి. 

యూపీఐ ద్వారా నగదు పొందాలంటే ముందుగా ఎంత మెుత్తం డ్రా చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ సాధారణ ఏటీఎంల మాదిరే రూ.100, రూ.500, రూ.1000,  వంటి మొత్తాల వంటి నగదు అప్షన్స్ కనిపిస్తాయి. ఎంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నారో ఎంటర్ చేయాలి. అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్‌ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. తర్వాత మీ యూపీఐ పిన్  ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ కరెర్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ప్రక్రియ మెుదలవుతుంది. అది పూర్తి అయిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి. 

సాధారణంగా ఏటీఎం కార్డుతో ఎలా ట్రాన్సక్షన్ చేస్తామో ఈ ఏటీఎంలో కూడా అంతే ఉంటుంది. అక్కడ కార్డు వివరాలను ఏటీఎం రీడ్ చేసి మీ వివరాలను స్క్రీన్ మీద చూపిస్తే.. ఈ యూపీఏ ఏటీఎంలలో మాత్రం మీరు స్కాన్ చేసిన అనంతరం యూపీఐ యాప్ వివరాలను స్కాన్ చేస్తుంది అంతే తేడా. ప్రస్తుతం దేశంలో 3000 ఏటీఎంలకు ఇది యాక్సస్ కలిగి ఉన్నట్లు చెప్తుండగా.. త్వరలోనే ఈ ఏటీఎంలలో సేవలు అందుబాటులో రానున్నాయని చెప్తున్నారు. ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థలచే నిర్వహించబడుతుండగా.. యూపీఏ, కార్డుల స్కిమ్మింగ్ వంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.