ఏలిన వారికి అడుగులకు మడుగులొత్తడానికే పరిమితమా?.. నవ్వుల పాలౌతున్న ఏపీ పోలీసు వ్యవస్థ!

Publish Date:Sep 9, 2023

Advertisement

చట్టానికీ, న్యాయానికీ ధర్మానికీ కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనే పవర్ ఫుల్ సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. పోలీసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ ఈ డైలాగ్ ను ఉటంకించడం పరిపాటిగా మారిపోయింది. అటువంటి నాలుగో సింహం ఏపీలో మాత్రం నవ్వుల పాలౌతోంది. అభాసుపాలౌతోంది. అధికార పార్టీ క్రియాశీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరుతో మొత్తం పోలీసు వ్యవస్థపైనే జనంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పాలి. ముఖ్యంగా సీఐడీ నమోదు చేసే ప్రతి కేసూ, చేసే ప్రతి అరెస్టు కేవలం అధికార పార్టీ ప్రాపకం కోసమే అన్నట్లుగా ఉంటున్నాయి. ఇందుకోసం సీఐడీ సీఆర్పీసీ నిబంధనలను సైతం తుంగలో తొక్కి ముందుకు సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక పోలీసు వ్యవస్థ విపక్ష నేతల పర్యటనలకు భద్రత కల్పించాల్సింది పోయి వారిపై దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించడం కొండొకచో.. దాడులకు పాల్పడేవారికి రక్షణ కవచంగా నిలబడటం చేస్తోందంటున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇలా విపక్షాల నాయకులపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడుతుంటే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి నిలబడిపోతోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  నిందితులపై చర్యలు తీసుకోవలసిన, ముద్దాయిలపై కేసులు పెట్టాల్సిన వాళ్లు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ, విపక్షాల నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  

ఏ రాష్ట్రంలోనయినా వీవీఐపీలు, కేంద్రభద్రత ఉన్న ప్రముఖులకు.. ఆయా రాష్ట్రాల పోలీసులు భద్రత కల్పించడం రివాజు. సదరు ప్రముఖుల పర్యటన పూర్తయ్యేవరకూ  ఎటన్షన్ లో ఉండాల్సిన పోలీసులు ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతల. మరీ ముఖ్యంగా జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలకు పోలీసుల ప్రోత్సాహం, సహకారం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.    ఏపీలో అధికార పార్టీ మూకలు జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనలలో ఆయనకు అత్యంత సమీపంగా వెళ్లి దాడులకు తెగబడుతున్నా.. ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైపెచ్చు అధికార పార్టీ శ్రేణులకు చంద్రబాబుకు అత్యంత సమీపంలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనలలో వరుసగా చోటు చేసుకున్న, చోటు చేసుకుంటున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు తెలుగుదేశం విమర్శలు అక్షర సత్యాలనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతా జరిగిన తరువాత  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేసి స్వామి భక్తిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   

డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం  కార్యాలయంపై  వైసీపీ శ్రేణులు  దాడి చేసి, అద్దాలు-తలుపులు ధ్వంసం చేసి, కార్యాలయ సిబ్బందిని గాయపరిస్తే వారిపై కేసులు నమోదు చేయడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగకపోవడాన్ని తెలుగుదేశం వర్గాలు ఎత్తి చూపుతున్నాయి. పోలీసుల చిత్తశుద్ధిని, విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం కార్యాలయంపై వైసీసీ దాడి అనంతరం ఎస్పీజీ అధికారులు  వచ్చి పరిశీలించి బాబు భద్రత విషయంలో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వెళ్లారంటే ఏపీ పోలీసుల తీరు ఎంత దివ్యంగా ఉందో ఇట్లే అవగతమౌతుంది.   
హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టింగుల విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర పోలీసులు, సీఐడీ విఫలమయ్యారంటూ హైకోర్టు ఆ కేసులు సీబీఐకి అప్పగించిందంటేనే ఏపీలో పోలీసు వ్యవస్థ తీరు తెన్నులు ఎలాగున్నాయన్నది ఎవరికైనా అర్ధమైపోతుంది.  అయితే సీఎంపై సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టారన్న కారణంతో వృద్ధులు, వికలాంగులు, విద్యార్ధులపై కేసులు పెట్టే పోలీసుల ఉత్సాహం.. హైకోర్టు జడ్జిలపై పోస్టింగుల విషయంలో ఏమైందని ప్రశ్నలు అదే సమాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.   

అలాగే మార్గదర్శి కేసుల , అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న కోర్టు ఆదేశాలు కూడా  సీఐడీ ధిక్కరిస్తున్న వైనం పరిశీలిస్తే పోలీసులకు నిజమైన బాస్ ఎవరో ఇట్టే తెలిసిపోతుందని పరిశీలకులు అంటున్నారు.  అధికారంలో ఉన్న వారికి అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పూర్తిగా కోల్పోక ముందే  తీరు మార్చుకుంటే మేలని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.   

తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ నంద్యాలలో అరెస్టు చేసిన తీరు, ఆ సందర్భంగా పోలీసులు చూపిన అత్యుత్సాహం, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఉందో లేదో కూడా చూసుకోకుండా అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసు ఇచ్చి విజయవాడకు తరలించడం చూస్తుంటే.. పోలీసులు చట్టానికి లోబడి కాకుండా.. అధికారంలో ఉన్న కొద్ది మంది వ్యక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.