వెంకయ్య నాయుడు మంచి ప్రయత్నమే చేసారు

Publish Date:Mar 14, 2015

Advertisement

 

రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేస్తామని కేంద్రం హామీ ఇస్తున్నప్పటికీ అది ఆచరణలో కనబడకపోవడంతో రెండు రాష్ట్రాలలో ప్రజలలో, ప్రభుత్వాలలో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని అది క్రమేపీ పెరుగుతూ వస్తోంది. కానీ బీజేపీ దానిని పసిగట్టడంలో విఫలమయ్యిందో లేక ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమను గట్టిగా ప్రశ్నించవని భావించిందో తెలియదు కానీ ఇంతకాలం ఒట్టి హామీలతో కాలక్షేపం చేసింది. ఆ కారణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఇరు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువెత్తిన నిరసనలు, నేటికీ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు  ఆందోళనలు ఉద్రుతమయ్యాయి. అప్పుడు కానీ బీజేపీ పూర్తిగా మేల్కొనలేకపోయింది.

 

కానీ అలాగని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఇంతవరకు ఏమి చేయలేదని కానీ అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోందని కూడా మోడీ ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదు. కేంద్రం తెర వెనుక తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. కానీ ఇరురాష్ట్రాలలో బీజేపీ నేతలు ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాలతో కుస్తీ పట్లు పట్టేందుకే ప్రయత్నించేరు తప్ప కేంద్రం ఇరు రాష్ట్రాలకు ఏమేమి ఇచ్చింది ఇంకా మున్ముందు ఏమేమి ఇవ్వబోతోంది? అనే విషయాలను ప్రజలకు చెప్పుకోవడంలో అశ్రద్ధ వహించారు. అందుకే ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది.

 

ఇంతకాలం హామీలు అమలుచేస్తామని పదేపదే చెపుతున్న వెంకయ్య నాయుడు తన పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలలో నెలకొన్న అపోహలను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా మొత్తం 35 మంది కేంద్రమంత్రులను తన చాంబర్ లో సమావేశపరిచి వారిచేతనే రెండు రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ఇంతవరకు ఏమేమి చేసింది, ఏమేమి చేయబోతోంది? హామీల అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే విషయాలపై మీడియాకు సమాధానాలు చెప్పించారు. వారు చెప్పిన ప్రకారం రెండు రాష్ట్రాల కోసం కేంద్రప్రభుత్వం తెరవెనుక చాలా కృషి చేస్తున్నట్లు స్పష్టమయింది.

 

ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ (ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి), పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, తిరుపతిలో ఐఐటి, ఐ.ఐ.యస్.ఈ.ఆర్.లకు త్వరలో శంఖుస్థాపన, మంగళగిరిలో ఎయిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటు, కడపలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నెలకొల్పే విషయంపై స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌), ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, విశాఖలో ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసు కార్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని సంబంధిత కేంద్రమంత్రులు చెప్పారు. వాటిలో కొన్ని ప్రతిపాదనలు పరిశీలనలో ఉండగా, మరికొన్నిటి కోసం సాంకేతిక అధ్యయనం జరుగుతోంది. తిరుపతిలో ఐఐటి వంటి సంస్థలకు త్వరలోనే శంఖు స్థాపన చేయబోతున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.

 

ఇక తెలంగాణాకి సంబంధించి, రామగుండంలో ఎంజిఆర్‌ ప్రాంతంలో 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టు రామగుండంలో ఫర్టిలైజేషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ను పునరుద్ధరన, గ్యాస్‌ ఆధారిత ఎరువుల ప్లాంట్‌ను ఏర్పాటు, హైకోర్టు విభజన, రెండు రాష్ట్రాల మధ్య జాతీయ రహదారుల నిర్మాణం వంటివి వివిధ దశలలో ఉన్నట్లు సంబంధిత కేంద్రమంత్రులు చెప్పారు.

 

కేంద్రప్రభుత్వం తెరవెనుక ఇంత కృషి చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఇంతవరకు ప్రజలకు చేరవేయడంలో అలసత్వం ప్రదర్శించినందునే ప్రజలలో ఈ అపోహలు కలిగాయి. వెంకయ్య నాయుడు చేసిన ఈ ప్రయత్నం వలన ఆ అపోహలు కొంతయినా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వారు చెపుతున్నవన్నీ వీలయినంత త్వరగా ఆచరణలోకి వచ్చేందుకు వారు గట్టిగా కృషి చేయాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.