ఆ ఇద్ద‌రితో ఫుట్‌బాల్‌!?.. జ‌గ‌న‌న్నా మ‌జాకా!!

Publish Date:Feb 19, 2022

Advertisement

జగన్‌ రెడ్డి సర్కార్‌ ఇటీవలే చేసిన రెండు కీలక బదిల్లీల్లో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను అకస్మాత్తుగా ఆ పదవి నుంచి తప్పించి, జీఏడీకి రిపోర్టు చేయాలని సర్కార్‌ ఆదేశించింది. ఇక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌ ను కూడా ఏపీ సర్కార్‌ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్‌ కమిషనర్‌ గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామంగా గౌతమ్‌ సవాంగ్‌ ను ఏపీపీఎస్‌సీ చైర్మన్‌ గా నియమించింది. అయితే.. రాజ్యాంగ పదవి అయిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గా సవాంగ్‌ బాధ్యతలు చేపట్టాలంటే తన ఐపీఎస్‌ హోదాను వదులుకోవాల్సి ఉంటుంది. సవాంగ్‌ రిటైర్‌ మెంట్‌ కు మరికొన్ని సంవత్సరాలే ఉండడంతో ఆయన తన ఐపీఎస్‌ హోదాను వదులుకునేందుకు సిద్ధంగా లేరనే వార్తలు వినిపించాయి. దీంతో గౌతమ్‌ సవాంగ్‌ ఫైల్‌ ను‘డీమ్డ్‌ టు బి రిటైర్డ్‌’ క్లాజుతో గవర్నర్ ఆమోదానికి సర్కార్‌ పంపించింది. అంటే ఏపీపీఎస్సీ పోస్టులో చేరిన మరుక్షణం నుంచీ సవాంగ్‌ ఐపీఎస్‌ హోదా రద్దయిపోతుందన్నమాట.

ఇక మరో బ్యూరోక్రాట్‌ ప్రవీణ్ ప్రకాశ్ మాత్రం తాను ఢిల్లీకి వెళ్లబోనని, సీఎం పేషీలోనే ఉంటానంటూ మొండికేసినట్లు వినికిడి. కోరుకున్నది ఒకటైతే జరిగింది మరొకటని ప్రవీణ్ ప్రకాశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లేదంటే మరో ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏపీలోనూ, అక్కడ ఢిల్లీలో కూడా ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ ప్రవీణ్ ప్రకాశ్‌ ప్రపోజల్ పెట్టారట. కానీ అందుకు జగన్ రెడ్డి సర్కార్‌ కేసుల నెపం చెప్పి ససేమిరా అందట. దీంతో చేసేదేమీ లేక ప్రవీణ్ ప్రకాశ్ ఉసూరుమంటూ శుక్రవారం రాత్రికి ఢిల్లీ వెళ్లారట.

గౌతం సవాంగ్‌ ఏపీ డీజీపీ అయినప్పటి నుంచీ జగన్‌ కు, ఆయన ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు అనుకూలంగా అనేక విషయాల్లో తోడ్పాటు అందించారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో, వారిని అరెస్టులు చేయించడంలో, జైళ్లలో పెట్టించడంలో గౌతమ్‌ సవాంగ్‌ సర్కార్‌ అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు టీడీపీ నేతలు నిరంతరం దుమ్మెత్తి పోస్తూనే ఉండేవారు. అలాంటి నమ్మిన ఆఫీసర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ను జగన్‌ సర్కార్‌ అత్యంత అవమానకరమైన రీతిలో బదిలీ చేయడంపై పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అలా వస్తున్న విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకే అన్నట్లు.. సవాంగ్ ఇమేజిని పెంచుతున్నట్లు వైసీపీ సర్కార్‌ ఇప్పుడాయనకు ఏపీపీఎస్సీ సారథిగా నియమించిందని అంటున్నారు. నిజానికి సవాంగ్‌ ఇమేజిని జగన్ రెడ్డి సర్కార్ పెంచేదే అయితే.. అర్ధంతరంగా బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సవాంగ్ బదిలీ వ్యవహారం ముమ్మాటికి ఆయనను అవమానించడమే అంటున్నారు. గౌతమ్‌ సవాంగ్‌ విషయంలో జగన్‌ రెడ్డి సహజసిద్ధ వైఖరి వాడుకుని వదిలించుకునే తీరునే బయటపెట్టారనే విమర్శలు వచ్చాయి. అయితే.. సవాంగ్ అసలే పోలీసాఫీసర్‌.. గత అనుభవాల దృష్ట్యా ఏపీపీఎస్సీ పోస్టుకు వెళ్లేందుకు ముందు నిరాకరించారనే సమాచారం వచ్చింది. దాంతో తన సన్నిహితుల ద్వారా రోజంతా రాయబారాలు పంపి ఎంతో కష్టపడి సవాంగ్‌ ను జగన్ రెడ్డి ఒప్పించారంటారు. 

సీఎం పేషీలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ విషయంలో జగన్ రెడ్డి సర్కార్‌ కు బాగా తలబొప్పి కట్టిందనే వార్తలు వచ్చాయి. ప్రవీణ్ ప్రకాశ్‌ సతీమణి భావనా సక్సేనా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. ఆమె పనిచేస్తున్న పోస్టులోకే ప్రవీణ్‌ ప్రకాశ్‌ ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్‌ సమీర్ శర్మ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ప్రవీణ్ ప్రకాశ్‌ ఏపీ సీఎం పేషీలో ఉంటూనే.. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషన్‌ గా కూడా బాధ్యతలు నిర్వర్తించలని కోరుకున్నారట. కానీ ఏదో సమాచార లోపం తలెత్తి ఆయనను ఎకాఎకిన ఢిల్లీకి బదిలీ చేసేశారు. దాంతో సీఎం పేషీని తాను వదిలేది లేదని మొండికేశారట. బదిలీ అయినా ఆయన మూడు రోజుల పాటు పేషీలోనే ఉండడం విశేషం. పేషీలోనే కొనసాగించాలంటూ సీఎం జగన్‌ పై ఎంతగా వత్తిడి తెచ్చినా స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ప్రవీణ్ ప్రకాశ్‌ ఢిల్లీకి పయనమయ్యారని అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.