ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు? తిరుపతిలో కలకలం... ఇంకా నిర్దారణ కాలేదన్న DMHO
Publish Date:Dec 12, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒక విశాఖలో ఒమిక్రాన్ కేసు నిర్దారణ కాగా.. తిరుపతికి చెందిన మరో యువకుడికి ఒమిక్రాన్ సోకిందని తెలుస్తోంది. బ్రిటన్ నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలున్నాయని చెబుతున్నారు. 34 ఏళ్ల ఆ వ్యక్తి శాంపిల్స్ జీనోమ్ టెస్ట్ కు పంపించారు. అవి వచ్చాకే ఒమిక్రాన్ సోకింది లేనిది నిర్దారణ కానుంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఈ నెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చాడు. తిరుపతి లో ఒమిక్రాన్ కేసు నమోదు అయినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని చిత్తూరు జిల్లా డీఎంహెచ్ వో శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో నమోదైంది కరోన పాజిటివ్ మాత్రమేనని.. ఆ వ్యక్తి నమూనాలను జీనోమ్ కి పంపడం జరిగిందని చెప్పారు. ఒమిక్రాన్ గా ఇంకా నిర్ధారణ కాలేదని.. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు డిఎంహెచ్ఓ సూచించారు. విజయనగరంలో ఓ కేసు నమోదైందని ఆదివారం ఉదయం అధికారులు అధికారికంగా నిర్ధారించారు.ఈ నెల 5న ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయిందని విజయనగరం జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ రమణకుమారి తెలిపారు. అతను విశాఖలోని తన అత్తారింటికి వెళ్లాడని తెలిపారు. అతడికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 6న హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపామని చెప్పారు. ఒమిక్రాన్ గా తేలిందని చెప్పారు. అతనికి శనివారం మరోసారి టెస్ట్ చేయగా నెగెటివ్ గా రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇక ఒమిక్రాన్ సోకిన బాధితుడిని కలిసిన 40 మందిని గుర్తించి టెస్టులు చేయగా.. వాళ్లందరికి నెగెటివ్ వచ్చిందన్నారు విజయనగరం డీఎంహెవో. అతడు ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఉన్న వంద మందికి టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.
http://www.teluguone.com/news/content/uk-return-tested-positive-tirupati-people-fear-for-omicron-39-128225.html





