ఖమ్మం వర్సెస్ ఢిల్లీ.. ఇక షా- కేటీఆర్ వార్

Publish Date:Apr 19, 2022

Advertisement

యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన తెరాస, ఇప్పుడు మరో అంశాన్ని తెరమీదకు తెస్తోది. అఫ్కోర్స్, తెరాసతో యుద్ధానికి సై అంటున్న బీజేపీ నాయకత్వం కూడా, ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమవుతోంది. యాసంగి ధాన్యం సేకరణ విషయంలో గత నాలుగైదు నెలల్లో తెరాస గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివిధ రూపాల్లో,వివిధ స్థాయిల్లో ఆందోళన సాగించింది.అయినా చివరకు చేసేది లేక, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకునేందుకు సరే అంది. ఒక విధంగా సంధి చేసుకుంది.

అయితే, ఆ యవ్వారం ఇంకా అలా సాగుతుండగానే, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య ఉదంతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త వివాదానికి తెర తీసింది. జిల్లా మంత్రి, పువ్వాడ అజయ్ ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన చిత్ర హింసలు, వేధింపులు  తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ తమ మరణ వాగ్ములంలోనూ అదే విషయం చెప్పారు. ఈ నెల (ఏప్రిల్) 14న పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పురుగులమందు తాగిన సాయి గణేష్  హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ, రెండురోజుల తర్వాత చనిపోయారు. ఈ సందర్భంగా అతను ఇచ్చిన వాగ్ములంలో,  మంత్రి పువ్వాడ ప్రోద్బలంతో అక్రమ కేసులతో ఖమ్మం పోలీసులు తనను వేధిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.  పోలీసుల చిత్ర హింసలు భరించలేకనే, తాను ఆత్మహత్య చేస్కునేందుకు పురుగులమందు తాగినట్లు చెప్పారని బీజేపీ నాయకులు  అంటున్నారు. 

ఈ ఉదంతం పై గత వారం రోజులుగా ఖమ్మం జిల్లాలో ఆందోళన కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్’ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్  చేయాలని  డిమాండ్ చేస్తున్నాయి. సాయి గణేశ ఆత్మహత్య ఫై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత మూడేళ్లుగా ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టి పువ్వాడ వేధిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటు ప్రభుత్వం గానీ అటు అధికార తెరాస గానీ, ఈ విషయంలో ఇంత వరకు పెదవి విప్పలేదు. అయితే, మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నారు. 

ఇదలా ఉంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సాయిగణేష్ కుటుంబ సభ్యులు అమ్మమ్మ సావిత్రి,, చెల్లి కావేరితో ఫోన్లో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని, సాయి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కేంద్ర హోమ్ మంత్రి హోదాలో షా కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సాయిగణేష్ మృతిపై సీబీఐ విచారణ జరపించాలని కుటుంబ సభ్యులు కోరారు,ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా అదే డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. 

అటునుంచి అమిత్ షా అలా ఎంటర్ అయితే, ఇటు నుంచి మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఖమ్మం విషయాన్ని వదిలేసి, ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబందించి, వీహెచ్’పీ, భజరంగదళ్ చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యల ఆదారంగా అమిత్ షా పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ సంఘటనలకు సబందించి  తమ కార్యకర్తల పై కేసులు పెడితే ఊరుకునేది లేదని వీహెచ్’పీ, భజరంగదళ్ పోలీసులను హెచ్చరించడాన్ని కేసీఆర్ ట్వీటర్ వేదికగా తప్పు పట్టారు. వీహెచ్’పీ, భజరంగదళ్ చట్టానికి అతీతమా? అని అమిత్ షా’ను ప్రశ్నించారు. 
నిజానికి హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో రాళ్ళు రువ్వడం వంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్ననేపధ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు వివిధ లౌకిక వాద పార్టీలకు చెందిన 13 మంది జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయుక్త ప్రకటన విదుదల చేశారు. అయితే, ఎందుకనో గానీ, లౌకికవాద పార్టీలు, అందులో స్టాలిన్, పవార్, మమతా, జూనియర్ సోరెన్  వంటి కేసీఆర్ కలిసొచ్చిన నేతలు అందరూ ఉన్నారు కానీ, కేసీఆర్ లేదు.లౌకికవాద పార్టీలు ఎదుకనో  తెరాసను, కేసీఆర్ ‘ను తమ జట్టులో కలుపుకోలేదు. అది వేరే విషయమే అయినా, దేశంలో రాజకీయాలు హిందుత్వ, హిందూ వ్యతిరేక శక్తుల చుట్టూ తిరుగుతున్న సమయంలో కేంద్ర హోమ్ మంత్రి ఖమ్మంలో బీజేపీ,వీహెచ్’ పీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో నేరుగా జోక్యం చేసుకోవడం,అందుకు స్పందనగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీ సంఘటనను ముడివేసి స్పందించడం చూస్తుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, బీజేపీ, తెరాసల మధ్య మరో వివాదానికి తెర లేచినట్లే ఉందని పరిశీలకులు అంటున్నారు. అదే నిజం అయితే ఇక అమిత్ షా, కేటీఆర్ వార్ అనివార్యం, అనిపిస్తోంది.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.