పోలీసుల తలపై శాంటాక్లాజ్ టోపీలు! సర్జికల్ స్ట్రైక్ అవసరమన్న బీజేపీ నేతలు  

Publish Date:Dec 14, 2020

Advertisement

సర్జికల్ స్ట్రైక్. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసినప్పుడు మార్మోగిన పదం. కొన్ని రోజుల పాటు దేశ వ్యాప్తంగా సర్టికల్ స్టైక్స్ పైనే చర్చ జరిగింది. అప్పటి నుంచి ఎక్కడైనా పెద్ద ఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్ అని చెప్పుకుంటూ  ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సర్జికల్ స్ట్రైక్ పదం మరోసారి ప్రకంపనలు రేపింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కామెంట్లు రాజకీయ కాక రేపాయి. సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్ల చుట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారమంతా సాగింది. గ్రేటర్ లో ఊహించని ఫలితాలు సాధించిన బీజేపీ విజయంలో సర్జికల్ స్ట్రైక్ అంశం కీలకంగా నిలిచిందని రాజకీయ వర్గాల అభిప్రాయం.

 

తెలంగాణలో బీజేపీ దూకుడుకు ఉపయోగపడిన సర్జికల్ స్ట్రైక్ పదం ఇప్పుడు ఏపీలోనూ మార్మోగుతోంది. అక్కడ కూడా కమలనాధులే జగన్ సర్కార్ పై పోరాటంలో తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఏపీలో హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీటీడీ, విజయవాడ కనకదర్గ వంటి ప్రముఖల ఆలయాలతో పాటు ఇతర గుడుల్లో  వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హిందూ సాంప్రదాయాలు మంటగలిపేలా కావాలనే కొందరు ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్రైస్తవ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం భృతి ఇవ్వడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇవన్ని ఇలా ఉండగానే  తాజాగా క్రిస్మస్ వేడుకల అంశం ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు జరపడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.  

 

విజయవాడ పట్టణ మూడో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గత వారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి, శాంటాక్లాజ్ టోపీలు ధరించారు. పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి శాంటాక్లాజ్ టోపీలు ధరించడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు, ఏపీ సర్కార్ తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని జీవీఎల్ అన్నారు. ఏపీలో మత రాజకీయాలు చేయడంలో వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయని, ఆ రెండిటిపైనా రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని జీవీఎల్ ప్రశ్నించారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యలో కూడా ముస్లిం ఓట్ల కోసం పోలీసులను వేధించారని చెప్పారు. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

 

పోలీసులు శాంటాక్లాజ్ టోపీలు ధరించి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వీడియోను ట్వీట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ నేతలు. 41 రోజులు అయప్ప మాల ధరించిన పోలీసులు కూడా నాలుగు సింహాలున్న టోపీని గౌరవిస్తారు.. పవిత్ర రంజాన్ మాసంలో 41 రోజులు ఉపవాస దీక్ష చేసే ముస్లింలు కూడా నాలుగు సింహాలున్న టోపీని అంతే గౌరవంతో చూస్తారు.. మరి క్రిస్మస్ సమయంలో ఆ అవసరం లేదా? లేకుంటే ఆంధ్రాలో నాలుగు సింహాల టోపీకి విలువ తగ్గించారా? అని ఏపీ సర్కార్ ను కడిగి పారేస్తున్నారు  కమలం నేతలు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కోవిడ్ నిబంధనలు అమలు చేస్తారు.. ప్రతి సంవత్సరం జరుపుకోనే వినాయక చవితి పండుగకు విగ్రహాలు పెట్టకూడదంటారు.. మరి వీరికి మాత్రం ఏ నిబందనలూ వర్తించవా?' అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు, సర్జికల్ స్ట్రైక్ అంశాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్న కమలం నేతలు.. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి  చెబుతామని అంటున్నారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.