కేంద్రం దగ్గర కేసీఆర్ ప్రాజెక్టుల చిట్టా! సీఎంవో నుంచే సమాచారం లీక్?  

Publish Date:Dec 14, 2020

Advertisement

ప్రగతి భవన్ లో లీకు వీరులున్నారా? కేసీఆర్ రహస్య చిట్టా మొత్తం కేంద్రం చేతికి వెళ్లిందా? లీకేజీ సమాచారంతో టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పంజా విసరబోతుందా? అంటే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. పాలనా వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ రహస్యంగా దాచాలనుకున్న విషయాలన్నీ బహిర్గతమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతలకు బ్రేక్ వేస్తూ కేంద్ర జలవనరుల శాఖ నుంచి వచ్చిన లేఖ ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ లో అలజడి రేపుతుందని చెబుతున్నారు. కేంద్ర మంతి గజేంద్ర షెకావత్​… సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయట. లేఖలో చాలా విషయాలను పాయింట్​ టు పాయింట్​ కేంద్రం అడిగిందట. కేంద్ర మంత్రి నుంచి వచ్చిన లేఖతో కేసీఆర్ ఇంతకాలం రహస్యంగా ఉంచిన ప్రాజెక్ట్ డీపీఆర్​లు కేంద్రం దగ్గర ఉన్నట్లు  స్పష్టమవుతోందట. కేంద్రం నుంచి లేఖ వచ్చిన రోజే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడం మరింత ఆసక్తిగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్ లు, అవినీతి ఆరోపణలపై సంజయ్ నుంచి బీజేపీ పెద్దలు మరింత సమాచారం తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

 

కేసీఆర్ సర్కార్ చేపట్టిన ఇరిగేషన్​ ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై జలశక్తి, కేఈఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీలు చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడుగుతూనే ఉన్నాయి. డీపీఆర్​లు సమర్పించాలని లేఖలు రాస్తూనే ఉన్నాయి. కేంద్రం కూడా దీనిపై చాలాసార్లు సీఎంకు అధికారికంగా లేఖలు పంపింది. అపెక్స్​ కౌన్సిల్​ కూడా డీపీఆర్​లు ఇవ్వాలని కోరింది. కానీ రాష్ట్రం మాత్రం అవన్నీ పాత ప్రాజెక్టులంటూ కొట్టిపారేస్తుందే కానీ డీపీఆర్​లు మాత్రం కేంద్రానికి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఆ డీపీఆర్ లు కేంద్రం దగ్గర ఉన్నాయని.. షెకావత్ నుంచి వచ్చిన లేఖ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాకు వచ్చారని సమాచారం. కేంద్రం చేతికి చెక్కిన ప్రాజెక్టుల డీపీఆర్ లతో రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఆ డీపీఆర్ లలో చాలా లోపాలు ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టులో  అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయట. ప్రైస్​ ఎస్కలేషన్​తో పాటు ఇసుక దందా, నిర్మాణాల్లో వైఫల్యాల వంటి అంశాలన్నీ కేంద్రం గుర్తించినట్లు చెప్పుతున్నారు. ఈ డీపీఆర్​లు కేంద్రానికి వెళ్లడం సీఎం కేసీఆర్​కు అగ్ని పరీక్షేనని చెబుతున్నారు. 

 

టీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్​ అయ్యాయనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రగతి భవన్​కు ఎవరైనా వెళ్లడం అత్యంత కష్టం.  చాలా సెక్యూరిటీ అంశాలను దాటుకుని  డీపీఆర్​లు బయటకు వెళ్లడం అంత ఈజీ కాదంటున్నారు. కేసీఆర్ అధికారిక నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. కొంతమంది ఉన్నతాధికారులను అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. దీంతో  తన దగ్గరే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిందెవ్వరనే అంశంపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారట గులాబీ బాస్. ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ టీం ఉంటోంది. సీనియర్​ ఐఏఎస్​లు, ముందు నుంచి తనకు అండగా నిలిచిన అధికారులకు ప్రగతిభవన్​లో స్థానం కల్పించారు కేసీఆర్. కొంతమంది సెంట్రల్​ సర్వీసుల్లో ఉన్న వారిని డిప్యూటేషన్​పై తెచ్చుకున్నారు.  అయితే ఇంత నమ్మకంగా ఉన్నా డీపీఆర్​ల విషయంలో నమ్మకద్రోహం చేసి కేంద్రానికి సహకరించిదెవ్వరనే అంశం  మిస్టరీగానే ఉందట.  కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన​ అధికారులపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 

 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక డీపీఆర్​లు కేంద్రం చేతికి చిక్కడంతో తమకు సమస్యలు తలెత్తుతున్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. అది కూడా కేంద్రంతో కొంత వివాదం మొదలైన నేపథ్యంలోనే డీపీఆర్​లు వెళ్లడం అధికార పార్టీని  మరింత కలవరపెడుతోందట. కేసీఆర్ సర్కార్ పై ఇప్పటికే దూకుడుగా వెళుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్ర బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని, కేంద్ర దగ్గర ఉన్న సమాచారం రాష్ట్ర నేతలకు కూడా చేరిందనే అనుమానాలను టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ డీపీఆర్ ల ద్వారా  ఏదో విధంగా తమను ఇరికించే ప్రయత్నాలు కేంద్ర సర్కార్ చేయవచ్చని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట.  మరీ ఈ విషయం ఎంత వరకు వెళుతుందో.. కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో.. చూడాలి మరీ..

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.