కాంగ్రెస్ గూటికి తుమ్మల?.. టీఆర్ఎస్ కు ఝలక్కేనా?

Publish Date:Oct 8, 2022

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందా? మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా సాగుతోందా? అంటే జిల్లాలో వరుసగా సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వచ్చేటట్లుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ సీనియర్ల మాట ఎలా ఉన్నా క్యాడర్ లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే పార్టీలోకి చేరికలు పెరిగాయి. అదే దారిలో టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి  తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.  

కందాల ఆ తరువాత తెరాస గూటికి చేరారు. దీంతో తుమ్మల ప్రాభవం నియోజకవర్గంలో బాగా తగ్గిపోయింది. తెరాస అధినేత కూడా తుమ్మలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో కందాల మాటే చెల్లుబాటౌతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకింత అసంతృప్తికి గురైన తుమ్మల.. తాజాగా కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు అనడంతో ఇక తెరాసలో ఉంటే రాజకీయంగా మనుగడ ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ సమావేశాలకు కూడా తుమ్మలకు ఆహ్వానం అందడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మల కాంగ్రెస్ వైపు దృష్టి సారించారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరే విషయంపై తన అనుచరులతో పలు మార్లు చర్చించిన తుమ్మల ఇక ఏ క్షణంలోనైనా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెరాస వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.