తుళ్లూరు స్టేషన్లో జై భీం తరహా టార్చర్!.. మైనార్టీలను చితక్కొట్టిన పోలీసులు!
Publish Date:Dec 24, 2021
Advertisement
తెలిసిందేగా ఏపీ పోలీసులంటే ఎలా ఉంటారో. దొరికితే చితక్కొట్టుడే. కుదిరితే థర్డ్ డిగ్రీ. అది సామాన్యులైనా.. పార్లమెంట్ సభ్యులైనా. వారికి తెలిసిందల్లా లాఠీలతో కుమ్మేయడమే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని.. నిందితులను చిత్రహింసలకు గురి చేయడమే...అనే విమర్శ ఉంది. అందుకు కారణం అధికార పార్టీ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం. తాము చెప్పిన వారిని టార్గెట్ చేస్తే చాలు.. ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని హింట్ ఇవ్వడం వల్లే ఖాకీలు ఇలా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే.. ఏపీలో కస్టడీ టార్చర్ కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు. జై భీమ్ లాంటి దారుణాలు అనేకం జరుగుతున్నాయని చెబుతున్నారు. తాజాగా.. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో గత రాత్రి 8మంది ముస్లింలను దారుణంగా చిత్రహింసలు పెట్టారని అంటున్నారు. ఈ విషయం బాధితులే స్వయంగా న్యాయమూర్తికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. తుళ్లూరు పోలీసులపై యాక్షన్ మొదలైంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. తుళ్లూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి 8 మంది ముస్లింలను ఓ కేసులో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. అయితే, పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను జడ్జి గత రాత్రి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు పంపారు. నిందితుల శరీరంపై గాయాలు ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. వెంటనే 8 మంది నిందితులకు రిమాండ్ రద్దు చేసిన జడ్జి.. వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్లో నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జై భీమ్ తరహా పోలీసులు చితక్కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/tulluru-police-tarcherd-8-people-in-station-39-128991.html





